-
-
Home » Telangana » Karimnagar » Telangana Sarpanch Elections 2025 final day Latest News, Dates, Results vreddy
-
Sarpanch Elections Live: పల్లె పోరులో తుది ఘట్టం!
ABN , First Publish Date - Dec 17 , 2025 | 10:05 AM
తెలంగాణలో సర్పంచ్ ఎన్నికల పోరు చివరి రోజుకు చేరుకుంది. మూడో విడతకు ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. ఈ ఎన్నికకు సంబంధించిన లైవ్ అప్డేట్స్ మీకోసం..
Live News & Update
-
Dec 17, 2025 12:11 IST
ఉమ్మడి వరంగల్ జిల్లాలో 11గంటల వరకు యావరేజ్ గా 55 శాతం పోలింగ్
-
Dec 17, 2025 12:10 IST
సంగారెడ్డి జిల్లా: మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 11 గంటల వరకు 59.39 శాతం పోలింగ్ నమోదు.
-
Dec 17, 2025 12:10 IST
మెదక్ జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ ఉదయం 11.00 గంటల సమయానికి సగటున 63.81శాతం పోలింగ్ నమోదు.
-
Dec 17, 2025 12:09 IST
మహబూబ్ నగర్ జిల్లాలో 11 గంటలకు 60.63 శాతం పోలింగ్ నమోదు
-
Dec 17, 2025 12:08 IST
వనపర్తి జిల్లాలో 11:00 వరకు 55% పోలింగ్ నమోదు
-
Dec 17, 2025 11:12 IST
ములుగు :
గొత్తికోయ గూడాల్లో ఓటర్ల చైతన్యం
కొండలు, గుట్టలు దాటుకుంటూ 17 కి. మీ. నడిచి వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న వాజేడు మండలం పెనుగోలు గ్రామ ఆదివాసీలు
-
Dec 17, 2025 10:42 IST
వికారాబాద్ జిల్లా: పరిగి మండలం మాదారం గ్రామంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో ఉద్రిక్తత
బీఆర్ఎస్, కాంగ్రెస్ వర్గాల మద్య ఘర్షణ
బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థి రాములుపై ప్రత్యర్థులు దాడి
దాడిలో సర్పంచ్ అభ్యర్థి రాములుకు తీవ్ర గాయాలు
కాంగ్రెస్ పార్టీకి చెందిన సాయిపైన దాడి చేసిన బీఆర్ఎస్ నేతలు
పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
పోలింగ్ బూత్ లో ఉన్న కొంతమంది ఏజంట్ లు పలు పార్టీలకు ఓట్లు వేయాలంటూ బలవంతం చేస్తున్నారని ఆరోపణ
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
పోలింగ్ స్టేషన్ కు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్న ఎస్పీ స్నేహ మెహ్రా
-
Dec 17, 2025 10:40 IST
మహబూబాబాద్ :
కురవి మండలం చంద్యా తండా పోలింగ్ బూత్ లో బీపీ డౌన్ కావడంతో కింద పడిపోయిన పోలింగ్ అధికారి శ్రీనివాస్
ఆసుపత్రికి తరలింపు
రిజర్వ్ లో ఉన్న మరో అధికారిని పోలింగ్ కేంద్రానికి పంపించిన ఉన్నతాధికారులు
యధావిధిగా కొనసాగుతున్న పోలింగ్ ప్రక్రియ
-
Dec 17, 2025 10:39 IST
ఖమ్మం జిల్లా:
కల్లూరు మండలం చెన్నూరు లో ఇంటర్నెట్ సెంటర్ లో డబ్బులు పంచుతున్నారని సమాచారం తో ఫ్లయింగ్ స్కాడ్ తనిఖీలు.
60 వేలు నగదు దొరకడంతో నగదును సీజ్ చేసిన అధికారులు.
అవి ఎన్నికలకు సంబంధించిన నగదు కాదు... షాపు నిర్వహణ కోసం తెచ్చిన నగదు గా చెబుతున్న షాపు యజమాని.
-
Dec 17, 2025 10:38 IST
మంచిర్యాల:
జైపూర్ (మం) ఇందారం పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్, స్వతంత్ర అభ్యర్థుల నిరసన
తమను పోలింగ్ కేంద్రంలోకి ఎందుకు వెళ్ళనీయడం లేదని పోలీసులతో వాగ్వాదం
కాంగ్రెస్ నేతలకు సహకరిస్తున్నారని ఆరోపణ
-
Dec 17, 2025 10:21 IST
కొమురం భీమ్ ఆసిఫాబాద్:
రెబ్బెన (మం) గోలేటిలోని సింగరేణి పాఠశాలలో పోలింగ్ కేంద్రంలో పోలీసులతో సర్పంచ్ అభ్యర్థుల వాగ్వాదం
తమను కూడా పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లనీయకుండా అడ్డుకుంటున్నారని ఆరోపణ
-
Dec 17, 2025 10:18 IST
తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్న యువత..



-
Dec 17, 2025 10:17 IST
మొదటి, రెండో విడత ఎన్నికల్లో పోలింగ్ దాదాపు 80 శాతం నమోదు..
-
Dec 17, 2025 10:16 IST
ఎన్నికల్లో మహిళా ఓటర్ల జోరు...

-
Dec 17, 2025 10:15 IST
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా 9 గంటల వరకు 24.23 శాతం పోలింగ్ నమోదు

-
Dec 17, 2025 10:13 IST
కొమురంభీం ఆసిఫాబాద్:
కాగజ్ నగర్ (మం) రాస్పెల్లి లో సర్పంచ్ అభ్యర్థి బొమ్మెల్ల రాజయ్య అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం,
ఆసుపత్రి కి తరలింపు
డబ్బులు లేకపోవడంతో ఓటమి పాలవుతానన్న భయంతో ఆత్మ హత్యయత్నం చేశాడని కుటుంబ సభ్యుల వెల్లడి
-
Dec 17, 2025 10:11 IST
ఓటు వేసేందుకు లైన్లో నిలబడిన ఓటర్లు..

-
Dec 17, 2025 10:09 IST
పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్న ఓటర్లు

-
Dec 17, 2025 10:08 IST
తెలంగాణలో తుది విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్
ఒంటిగంట వరకు పోలింగ్, మ. 2 నుంచి ఓట్ల లెక్కింపు
3,752 పంచాయతీలు, 28,410 వార్డులకు పోలింగ్
ఎన్నికల బరిలో 12,652 మంది సర్పంచ్ అభ్యర్థులు
ఎన్నికల బరిలో 75,725 మంది వార్డు మెంబర్ అభ్యర్థులు
మూడో విడతలో 394 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం
-
Dec 17, 2025 10:07 IST
ప్రత్యేక్ష ప్రసారం..
-
Dec 17, 2025 10:05 IST
పంచాయతీ ఎన్నికల్లో 9 గంటల వరకు 23.52 శాతం పోలింగ్