Vidala Rajini House Arrest: మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్
ABN , Publish Date - Dec 11 , 2025 | 09:24 AM
చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లికి సంఘీభావంగా విడదల రజిని మాచర్ల వెళతారని అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు.
పల్నాడు జిల్లా: చిలకలూరిపేటలో మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్ అయ్యారు. పిన్నెల్లి సోదరులు కోర్టులో లొంగిపోనున్న నేపథ్యంలో పోలీసులు ముందుస్తు చర్యలు తీసుకున్నారు. పిన్నెల్లికి సంఘీభావంగా విడదల రజిని మాచర్ల వెళతారని అధికారులు హౌస్ అరెస్ట్ చేశారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గురజాల సబ్ డివిజన్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు.
కాగా, పల్నాడు జిల్లాలో సంచలనం సృష్టించిన జంట హత్యల కేసులో వైసీపీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డి ఈ రోజు మాచర్ల కోర్టులో లొంగిపోనున్న సంగతి తెలిసిందే. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు వారు కోర్టుకు హాజరుకాబోతున్నారు.
ఈ రాజకీయ పరిణామాలను దృష్టిలో ఉంచుకుని, పోలీసులు జిల్లాలోని పలు ప్రాంతాలలో శాంతి భద్రతలు మెరుగుపర్చడానికి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. ప్రజల భద్రత కోసం కీలక చట్టాలను అమలు చేస్తున్నారు.
Also Read:
టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
ఇంద్రకీలాద్రిలో భవాని దీక్ష విరమణలు ప్రారంభం.. ప్రత్యేక ఏర్పాట్లు చేసిన ఆలయ కమిటీ
For More Latest News