Share News

TDP EX MLA Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి

ABN , Publish Date - Dec 11 , 2025 | 09:07 AM

గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు.

TDP EX MLA Pidathala Rama Bhupal Reddy: టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి మృతి
EX MLA Pidathala Rama Bhupal Reddy

ప్రకాశం జిల్లా: గిద్దలూరు టీడీపీ మాజీ ఎమ్మెల్యే పిడతల రామ భూపాల్ రెడ్డి (89) మృతి చెందారు. కొద్ది రోజులుగా వయసు రీత్యా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఇవాళ కన్నుమూశారు. హైదరాబాదులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రామ భూపాల్ రెడ్డి తుదిశ్వాస విడిచారు. తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలుపుతున్నారు.

TDP.jpg


కాగా, 1994లో టీడీపీ అభ్యర్థిగా గిద్దలూరు నుంచి పోటీ చేసి రామ భూపాల్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి ఆయన క్రియాశీల రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఆయన మరణవార్త తెలియగానే తెలుగు రాష్ట్రాల్లోని పలువురు కీలక రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం గిద్దలూరులో జరపనున్నట్లు తెలుస్తోంది.

TDP (1).jpg


Also Read:

మాజీ మంత్రి విడదల రజిని హౌస్ అరెస్ట్

మీ కాళ్ళు వణుకుతున్నాయా? ఈ 3 సూప్‌లతో తక్షణ ఉపశమనం.!

For More Latest News

Updated Date - Dec 11 , 2025 | 12:25 PM