Share News

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ

ABN , Publish Date - Jan 30 , 2026 | 08:48 PM

పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ సందర్శించారు. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమెకు భక్తులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది.

మాజీ మంత్రి విడదల రజనీకి నిరసన సెగ
Vidudala Rajani

పల్నాడు జిల్లా, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): పల్నాడు జిల్లాలోని యడ్లపాడు మండలం బోయపాలెం వేంకటేశ్వరస్వామి దేవాలయాన్ని మాజీ మంత్రి, వైసీపీ నేత విడదల రజనీ (Vidudala Rajani) శుక్రవారం సందర్శించారు. వేంకటేశ్వరస్వామి దర్శనం అనంతరం ఆమెకు భక్తులు, గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'లడ్డూ కల్తీ' వ్యవహారమే ఈ నిరసనలకు ప్రధాన కారణమైంది. విడదల రజనీ తన అనుచరులతో కలిసి బోయపాలెం వెంకన్నను దర్శించుకుని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.


భక్తుల ఆగ్రహం..

విడదల రజనీ ఆలయం నుంచి బయటకు రాగానే అప్పటికే అక్కడ వేచి ఉన్న గ్రామస్తులు, భక్తులు ఒక్కసారిగా నిరసనకు దిగారు. ‘గో బ్యాక్ రజనీ’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.


భక్తుల వాదన..

పవిత్రమైన తిరుమల లడ్డూ విషయంలో మహాపాపం చేసిన వారు, తమ గ్రామ దేవాలయానికి రావొద్దంటూ భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో జరిగిన పరిణామాలపై తమ నిరసనను వ్యక్తం చేశామని పేర్కొన్నారు.


మౌనంగా వెనుదిరిగిన విడదల రజనీ..

పరిస్థితి ఉద్రిక్తంగా మారుతుండటంతో విడదల రజనీ ఎటువంటి వ్యాఖ్యలు చేయకుండానే నిరసనల మధ్య తన కారులో అక్కడి నుంచి సైలెంట్‌గా వెనుదిరిగారు. ఆమెతో పాటూ ఉన్న వైసీపీ నేతలు కూడా అక్కడి నుంచి నిష్క్రమించారు.


రాజకీయ వర్గాల్లో చర్చ..

తిరుమల నెయ్యి కల్తీ అంశం కేవలం రాజకీయ విమర్శలకే పరిమితం కాకుండా, క్షేత్ర స్థాయిలో ప్రజల్లోకి కూడా ఎంత బలంగా వెళ్లిందో ఈ ఘటన నిరూపిస్తోంది. ముఖ్యంగా పల్నాడు వంటి ప్రాంతాల్లో వైసీపీ నేతలకు ఇలాంటి నిరసనలు ఎదురుకావడం పార్టీ శ్రేణుల్లో చర్చకు దారితీస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి..

కుట్రలు చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్

దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 30 , 2026 | 09:16 PM