కుట్రలు చేస్తున్నారు.. అప్రమత్తంగా ఉండండి: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:57 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు.
కాకినాడ, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (Minister Nara Lokesh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వంపై వైసీపీ కుట్ర రాజకీయాలు చేస్తోందని ధ్వజమెత్తారు. శుక్రవారం కాకినాడలో పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేడర్‌కు దిశానిర్దేశం చేశారు. వైసీపీ కల్తీ పార్టీ అని ఎద్దేవా చేశారు. కల్తీ మద్యం, కల్తీ నెయ్యి.. ఆఖరికి పార్టీ మొత్తం పైనుంచి కింద వరకు కల్తీనేనని సెటైర్లు గుప్పించారు.
వైసీపీవి కోడి కత్తి డ్రామాలు..
టీటీడీ నెయ్యి శాంపిల్ తీస్తే యానిమల్ ఫ్యాట్ ఉందని రిపోర్ట్ వచ్చిందని మంత్రి నారా లోకేశ్ ప్రస్తావించారు. గతంలో టీడీపీని భూ స్థాపితం చేస్తామన్న వాళ్లు ఈరోజు ఏ పరిస్థితిలో ఉన్నారో అందరికీ తెలుసునని ఎద్దేవా చేశారు. వైసీపీ కోడి కత్తి డ్రామాలు, బాబాయ్ హత్య వంటి ఎన్నో కుట్రలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూడా అలాంటి కుట్ర డ్రామాలు చేస్తున్నారని.. అప్రమత్తంగా ఉండాలని టీడీపీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు.
టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలి..
జగన్ రెడ్డి సినిమాల్లోకి వెళ్తే ఆస్కార్ కాకుండా భాస్కర్ అవార్డు ఇచ్చేవారని సెటైర్లు గుప్పించారు. అందుకే టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. ప్రజలకి వాస్తవాలు చెప్పి చైతన్యం చేయాలని సూచించారు. కూటమిలో ఉన్నందునే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడుకున్నామని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో టీడీపీ నేతల మధ్య గొడవలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నం చేస్తోందని, జాగ్రత్తగా ఉండాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.
ఇవి కూడా చదవండి..
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
ఆ భూములపై వైసీపీ దౌర్జన్యం చేస్తోంది.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
Read Latest AP News And Telugu News