ఆ భూములపై వైసీపీ దౌర్జన్యం చేస్తోంది.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం
ABN , Publish Date - Jan 30 , 2026 | 07:25 PM
గీతం విద్యా సంస్థల భూముల క్రమబద్ధీకరణపై జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దారుణమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో లేనటువంటి కల్చర్‌ని తీసుకొస్తూ చాలా దారుణంగా ప్రవర్తించడాన్ని పౌర సమాజం కూడా ఖండిస్తోందని అన్నారు..
విశాఖపట్నం, జనవరి30 (ఆంధ్రజ్యోతి): గీతం విద్యా సంస్థల భూముల క్రమబద్ధీకరణపై జీవీఎంసీ కౌన్సిల్‌లో వైసీపీ నేతలు దౌర్జన్యం చేయడం దారుణమని టీడీపీ ఏపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు (Palla Srinivasa Rao) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం విశాఖపట్నంలో పల్లా శ్రీనివాసరావు పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. విశాఖపట్నంలో లేని కల్చర్‌ని తీసుకొస్తూ దారుణంగా ప్రవర్తించడాన్ని పౌర సమాజం కూడా ఖండిస్తోందని అన్నారు.
ఆ అంశాన్ని ఆమోదం చేసుకోవాలనుకుంటే టేబుల్ ఎజెండాగా పెట్టుకోవచ్చని తెలిపారు. ఈ విషయంపై చర్చ చేయొచ్చు కదా.. ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడకుండా మేయర్‌పై దాడికి వెళ్లారని ప్రశ్నించారు. బీసీ వ్యక్తి మీద దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. వైసీపీ అధినాయకుడు వ్యవహార శైలి ఎలా ఉందో.. ఇక్కడ ఆయన అనుచరులు అలాగే వ్యవహరించారని ధ్వజమెత్తారు. ఆ భూములు వారికి తప్పితే వేరొకరికి పనికి రావని.. కావాలంటే పరిశీలించొచ్చని తెలిపారు. ఆ భూమిని జగన్ హయాంలోనే ఎందుకు వేరొకరికి కేటాయించలేకపోయారని ప్రశ్నల వర్షం కురిపించారు. రాజకీయాల కోసమే వైసీపీ సభ్యులు ఇదంతా చేస్తున్నారని పల్లా శ్రీనివాసరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
నాపై దాడి ప్రయత్నం వెనుక బొత్స పాత్ర: పీలా శ్రీనివాసరావు
దావోస్ పర్యటనలో ఏపీని బెస్ట్‌గా ప్రమోట్ చేశాం: మంత్రి టీజీ భరత్
Read Latest AP News And Telugu News