నాపై దాడి ప్రయత్నం వెనుక బొత్స పాత్ర: పీలా శ్రీనివాసరావు
ABN , Publish Date - Jan 30 , 2026 | 04:50 PM
తనపై దాడి ప్రయత్నం వెనుక మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ పాత్ర ఉందని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ తీరు బాగోలేదని.. ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు..
విశాఖపట్నం, జనవరి30 (ఆంధ్రజ్యోతి): తనపై దాడి ప్రయత్నం వెనుక మాజీ మంత్రి, వైసీపీ నేత బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) పాత్ర ఉందని విశాఖ మేయర్ పీలా శ్రీనివాసరావు (Visakhapatnam Mayor Pilla Srinivasa Rao) ఆరోపించారు. జీవీఎంసీ కౌన్సిల్ సమావేశంలో మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీరు బాగోలేదని.. ఆయన తీరును ఖండిస్తున్నానని పేర్కొన్నారు. తన మీద దాడి చేయడానికే వైసీపీ సభ్యులు కౌన్సిల్‌కు వచ్చారని తెలిపారు. తనపై ముగ్గురు వైసీపీ సభ్యులు దాడికి ప్రయత్నం చేశారని.. అందుకే వారిని సస్పెండ్ చేశామని చెప్పుకొచ్చారు.
మేయర్ పోడియం మీదకి దూకి తనపై దాడికి ప్రయత్నించారని.. దాడి చేసిన వారిలో వైసీపీ డిప్యూటీ మేయర్ సతీశ్ కూడా ఉన్నారని తెలిపారు. తనపై దాడి ప్రయత్నం వెనుక బొత్స పాత్ర ఉందని భావిస్తున్నానని చెప్పుకొచ్చారు. బొత్సకు జీవీఎంసీ కౌన్సిల్‌లో సభ్యత్వం లేదని అన్నారు. వైసీపీ వాళ్లు మేయరైన తనను టార్గెట్ చేశారన్నారు. వారు టార్గెట్ చేయాల్సింది సబ్జెక్టును అని హితవు పలికారు. గీతం భూముల విషయంలో కౌన్సిల్ తప్పు చేయలేదని పీలా శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
హోంగార్డు ఉద్యోగం.. అక్రమాస్తులు 20 కోట్లు
నిరుద్యోగులకు ఏపీ సర్కార్ శుభవార్త.. ఉగాది నాటికి..
Read Latest AP News And Telugu News