AP Cabinet Meeting: ఏపీ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ
ABN , Publish Date - Jan 08 , 2026 | 10:23 AM
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన గురువారం ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు.
అమరావతి, జనవరి8 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandra babu Naidu) అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో మంత్రి మండలి సమావేశం (AP Cabinet Meeting) జరుగుతుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చిస్తున్నారు. దాదాపు 38కు పైగా అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడుతున్నారు. ఏపీ లాజిస్టిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు ఆమోదం తెలపనుంది. ఎంఎస్‌ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్‌మెంట్ కార్యక్రమానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దాదాపు రూ.200కోట్లతో 45 ఎంఎస్‌ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే ఐదేళ్లలో 500మందికి ఉపాధి కల్పనే లక్ష్యంగా క్లస్టర్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం అమలు చేయనుంది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది.
ఎక్సైజ్ ట్యాక్స్‌పై చర్చ...
బార్లలో అదనపు రీటైల్ ఎక్సైజ్ ట్యాక్స్ ఉపసంహరణపై మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది కేబినెట్. మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో మైక్రో బ్రువరీలు ఏర్పాటుకు సంబంధించి మంత్రివర్గ ఉపసంఘం నివేదికపై చర్చించి నిర్ణయం తీసుకోనుంది. గ్రామీణ ప్రాంతాల్లో జల్‌జీవన్ ద్వారా నీటి సరఫరాకు రూ.5వేల కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వ గ్యారెంటీకి ఆమోదం తెలపనుంది మంత్రివర్గం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదించనుంది. ఒకటో తరగతి నుంచి పదోతరగతి విద్యార్థులకు పాఠశాల కిట్‌ల పంపిణీకి రూ. 944.53కోట్లను పరిపాలన అనుమతులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది.
విద్యుత్ ప్రాజెక్టులపై...
ఏపీలోని వివిధ ప్రాంతాల్లో సంప్రదాయేతర ఇంధన, విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు ఆమోదం తెలపనుంది. సీఆర్డీయే అథారిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు ఆమోదించనుంది. వివిధ సంస్థల భూకేటాయింపులకు మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఎస్ఐపీబీ సిఫారసులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. పయనీర్ క్లీన్ ఆంప్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 55.47 ఎకరాల భూమి కేటాయింపుపై ఓ నిర్ణయం తీసుకోనుంది. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్రం గ్రామంలో ప్రాజెక్టుపై చర్చించనున్నారు. హంసా–3 (NG) ట్రైనర్ విమానాల తయారీ, ఎమ్మార్వో, ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుపై మాట్లాడనున్నారు.
ఏవియేషన్ రంగంపై చర్చ..
ఆంధ్రప్రదేశ్‌లో ఏవియేషన్ రంగానికి పెద్ద ఊతం ఇచ్చేలా రాధిక వెజిటబుల్ ఆయిల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 64.67 ఎకరాల భూమి కేటాయింపై ఓ నిర్ణయం తీసుకోనుంది. విజయనగరం జిల్లా రాంబద్రపురం మండలం కొట్టకి గ్రామంలో ఆయిల్ పామ్ ప్రాసెసింగ్ ప్లాంట్‌పై చర్చించనున్నారు. ఆయిల్ పామ్ రైతులకు మద్దతు – విలువ జోడింపు పరిశ్రమకు ప్రోత్సాహం ఇచ్చేలా ఓ నిర్ణయం తీసుకోనుంది. రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్, డోజ్కో ఇండియా, వీఎస్‌ఆర్ సర్కన్ ఇండస్ట్రీస్‌కు అదనపు భూమి కేటాయింపుకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే, భూమి ధర చెల్లింపుకు గడువు పొడిగింపుపై (EOT) చర్చించనున్నారు.
గ్రీన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటుపై..
మంత్రి మండలి నిర్ణయంతో ఇప్పటికే ఉన్న పెట్టుబడుల గ్రౌండింగ్‌కు వేగం పెరగనుంది. షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్ భారీ పెట్టుబడి ప్రాజెక్టుకు ఎస్ఐపీబీ ఆమోదం తెలపనుంది. కడప జిల్లాలో గ్రీన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ ఏర్పాటుపై చర్చించనున్నారు. ఇందుకు గానూ పెట్టుబడి విలువ రూ.4,914 కోట్లు ఖర్చుచేయనుంది. గ్రీన్‌ఫీల్డ్ తయారీ యూనిట్ ద్వారా 5,000 మందికి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలను ప్రభుత్వం కల్పించనుంది. విద్యుత్, రహదారి, ఇండస్ట్రీయల్ వాటర్ వంటి మౌలిక సదుపాయాలకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక మద్దతు ఇవ్వనుంది. రామ్‌కో సిమెంట్స్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు ఎస్ఐపీబీ సిఫారసులకు ఆమోదం తెలపనుంది.
ఈ వార్తలు కూడా చదవండి...
రెయిన్ అలర్ట్... వాయుగుండం ప్రభావంతో వర్షాలు
భక్తులకు అలర్ట్.. ఆ దర్శనాలపై టీటీడీ కీలక ప్రకటన..
Read Latest AP News And Telugu News