Share News

ఏపీ మంత్రివర్గ సమావేశం.. చర్చిస్తున్న అంశాలివే

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:55 AM

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం జరుగుతోంది. ప్రధానంగా టీటీడీ లడ్డు నెయ్యి కల్తీపైనే చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది.

ఏపీ మంత్రివర్గ సమావేశం.. చర్చిస్తున్న అంశాలివే
AP Cabinet Meeting

అమరావతి, ఫిబ్రవరి 3: ఏపీ మంత్రివర్గ సమావేశం (AP Cabinet Meeting) మంగళవారం ప్రారంభమైంది. సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో అజెండాలోని అంశాలకంటే నాన్ అజెండా అంశాలపైనే ఎక్కువగా చర్చ జరుగుతోంది. తిరుమల లడ్డూ ప్రసాదంపై సిట్ ఛార్జ్‌షీట్, ప్రభుత్వానికి రాసిన లేఖ అంశంపై కూడా చర్చిస్తున్నట్లు తెలుస్తోంది. గత మంత్రి మండలి సమావేశాల్లోనూ ఈ అంశంపై చర్చ రాగా.. నివేదిక వచ్చాక దీనిపై మాట్లాడుదామని సీఎం చెప్పడంతో అప్పట్లో వాయిదా పడింది.


ఇదిలా ఉండగా, సిట్ నివేదిక ఆధారంగా కూటమి పార్టీలు వేసిన ఫ్లెక్సీలు, వైసీపీ నేతల నోటి దురుసు వ్యాఖ్యలతో తలెత్తిన పరిస్థితులపైనా కేబినెట్‌లో చర్చిస్తున్నట్లు సమాచారం. ఇక, కేబినెట్ సమావేశంలో కేవలం నాలుగు అంజెడా అంశాలు మాత్రమే ఉన్నాయి. జలవనరుల శాఖలో ప్రాజెక్టుల మెయింటెనెన్స్‌కు సవరించిన పరిపాలన అనుమతులకు మంత్రిమండలి ఆమోదం తెలుపనుంది. విద్యుత్ శాఖకు సంబంధించిన పలు నిర్ణయాలకు మంత్రిమండలిలో ఆమోద ముద్ర పడనుంది.


ఇవి కూడా చదవండి...

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 01:40 PM