Share News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు

ABN , Publish Date - Feb 03 , 2026 | 11:45 AM

భారత్ - అమెరికా దేశాల మధ్య కుదిరిన ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి మైలురాయి అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అభివర్ణించారు. అమెరికాతో వాణిజ్యం ఒప్పందం చేసుకోవడంపై ప్రధాని మోదీని సీఎం అభినందించారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు
CM Chandrababu Naidu

అమరావతి, ఫిబ్రవరి 3: భారత్ - అమెరికాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) స్వాగతించారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వానికి చారిత్రాత్మక మైలురాయి అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) నాయకత్వంలో ఈ ఒప్పందం కుదరడంపై సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు. సుంకాలను 18 శాతానికి తగ్గించడం ద్వారా ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందని సీఎం పేర్కొన్నారు.


చంద్రబాబు ట్వీట్..

అమెరికాతో చారిత్రక వాణిజ్య ఒప్పందం చేసుకోవటంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి అభినందించారు. సుంకాలను 18% శాతానికి తగ్గించడం ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుందన్నారు. నిరంతరం ప్రపంచ వృద్ధిని కాంక్షించేలా ఈ దార్శనిక నిర్ణయం ఉందని వెల్లడించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్ ప్రపంచ ఆర్థికశక్తి కేంద్రంగా తన పాత్రను సుస్థిరం చేసుకుంటోందన్నారు సీఎం. భారత ఎగుమతుల్లో పోటీతత్వాన్ని గణనీయంగా పెంచేలా ఒప్పందం ఉందన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం ఏపీ సహా దేశ యువత, రైతులకు అపారమైన అవకాశాలను సృష్టిస్తుందని సీఎం చంద్రబాబు ఎక్స్‌లో పోస్టు చేశారు.


ఇవి కూడా చదవండి...

కేసీఆర్ మెడలు వంచింది నేనే.. బండి సంజయ్ హాట్ కామెంట్స్

లండన్‌లో మంత్రి నారాయణ బృందం పర్యటన.. ఒలింపిక్ సైట్‌ల సందర్శన

Read Latest AP News And Telugu News

Updated Date - Feb 03 , 2026 | 11:55 AM