నెయ్యి కల్తీ వ్యవహారం.. ఏపీ కేబినెట్‌లో సిట్ నివేదికపై చర్చ
ABN , Publish Date - Feb 03 , 2026 | 02:34 PM
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్‌లో సుదీర్ఘంగా చర్చ జరుగుతోంది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయని మంత్రులు పేర్కొన్నారు.
అమరావతి, ఫిబ్రవరి 3: ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశం (AP Cabinet Meeting) కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ వ్యవహారంపై సిట్ ఇచ్చిన నివేదిక, లేఖ, ఛార్జ్‌షీట్‌పై ఏపీ మంత్రివర్గ సమావేశంలో సుదీర్ఘ చర్చ జరిగింది. ఇవాళ(మంగళవారం) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లడ్డూ ప్రసాదంలో రసాయనాలు కలిపిన విధానం, వివిధ విభాగాల తప్పిదాలను వివరిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి 11 పేజీలతో సిట్ నివేదికను అందజేసింది.
నివేదికలో సిట్ పేర్కొన్న అంశాలపై కేబినెట్‌లో చర్చిస్తున్నారు. లడ్డూలో కల్తీ నెయ్యి వాడకంలో విస్తుపోయే అంశాలు బయటపడుతున్నాయని మంత్రులు చెబుతున్నారు. అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్‌ను కేబినెట్‌కు పిలిపించారు. సిట్ నివేదిక ఆధారంగా న్యాయపరమైన చర్యలపై అడ్వకేట్ జనరల్‌తో చర్చించారు. నివేదికలోని ప్రతి అంశంపై లోతుగా మంత్రివర్గంలో చర్చ జరుగుతోంది.
ప్రభుత్వం తరఫున ఈ కేసులో ఏవైనా ఇంప్లీడ్ అవకాశాలు ఉన్నాయా? అనే అంశంపైనా ఆరా తీస్తోంది కేబినెట్. సూత్రధారులను వదిలేశామని వస్తున్న ఆంధ్రజ్యోతి కథనంపై కేబినెట్ దృష్టి సారించింది. డీజీపీని కూడా సమావేశానికి పిలిపించి చర్చిస్తున్నారు మంత్రులు. సిట్ రాసిన లేఖ, ఛార్జ్‌షీట్, నెయ్యిలో రసాయనాల మిశ్రమం వంటి వివరాలపై మంత్రివర్గం చర్చిస్తోంది.
ఇవి కూడా చదవండి...
అమెరికాతో వాణిజ్య ఒప్పందం.. ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు
అలాంటి వారికి పోలీసు ట్రీట్మెంట్ ఖాయం.. మంత్రి అనిత వార్నింగ్
Read Latest AP News And Telugu News