Share News

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

ABN , Publish Date - Feb 03 , 2026 | 12:45 PM

భారత్, అమెరికా మధ్య జరిగి వాణిజ్య ఒప్పందాన్ని(ట్రేడ్ డీల్) 'ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం'గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఇది ప్రపంచ వేదికపై పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యత మరింత పెంచుతుందని తెలిపారు.

అమెరికాతో వాణిజ్య ఒప్పందం ఈ శతాబ్దపు అతిపెద్ద డీల్: ప్రధాని మోదీ

ఢిల్లీ, ఫిబ్రవరి 03: అమెరికా-భారత్‌ల మధ్య వాణిజ్య ఒప్పందానికి(India US trade deal) అంగీకారం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో ఇకపై భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయ్యే వస్తువులపై సుంకాలు 18 శాతానికి తగ్గాయి. ఈ విషయంలో దక్షిణాసియాలోని పొరుగుదేశాల కంటే మన దేశమే పైచేయి సాధించినట్లయింది. బంగ్లాదేశ్‌, శ్రీలంకపై టారిఫ్‌లు 20 శాతం కాగా.. పాకిస్థాన్‌పై 19 శాతం, చైనాపై 34 శాతం వరకు సుంకాలు ఉన్నాయి. భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందంపై తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు.


భారత్, అమెరికా మధ్య జరిగిన వాణిజ్య ఒప్పందాన్ని(ట్రేడ్ డీల్) 'ఈ శతాబ్దపు అతిపెద్ద ఒప్పందం'గా ప్రధాని మోదీ అభివర్ణించారు. ఇది అంతర్జాతీయంగా పెరుగుతున్న భారత దేశ ప్రాముఖ్యతను మరింత పెంచుతుందని తెలిపారు. మంగళవారం ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశానికి ప్రధాని మోదీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్, అమెరికా మధ్య కుదిరిన ట్రేడ్ డీల్ కారణంగా ఇరు దేశాల పరస్పర సుంకాలు ప్రస్తుతం ఉన్న 25 శాతం నుంచి 18 శాతానికి తగ్గాయని వెల్లడించారు.


ప్రపంచ వ్యవహారాల్లో, సమతుల్యతను కాపాడుకోవడంలో భారత దేశ పాత్ర మరింత పెరుగుతుందని ఎన్డీఏ ఎంపీలతో ఆయన అన్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంతో కొంతమంది తీవ్ర నిరాశకు గురయ్యారని ప్రతిపక్ష పార్టీలను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ హాస్యంగా వ్యాఖ్యానించారు. భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధికి, ఎగుమతులు పెరిగేందుకు ఈ ఒప్పందం ఎంతో ఉపకరిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు. మరోవైపు ఈ సమావేశంలో ఎన్డీఏ ఎంపీలు ప్రధాని నరేంద్ర మోదీని సత్కరించారు.


ఇవి కూడా చదవండి:

హెచ్‌సీఏలో కీలక పరిణామం.. నూతన అధ్యక్షుడిగా అమర్‌నాథ్‌

బాయ్‌కాట్‌ నష్టం రూ.2200 కోట్లు!

Updated Date - Feb 03 , 2026 | 01:08 PM