అజిత్ పవార్ మరణం.. ప్రైవేట్ జెట్ కంపెనీకి షాక్
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:29 PM
అజిత్ పవార్.. లియర్‌జెట్ 45XR విమానంలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ లియర్‌జెట్ 45XR విమానం వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినది. విమానాలను అద్దెకు ఇచ్చే అతి పెద్ద సంస్థలలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒకటి.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ విమాన ప్రమాదంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) దర్యాప్తును ముమ్మరం చేసింది. వీఎస్ఆర్ వెంచర్స్‌పై స్పెషల్ ఆడిట్‌కు ఆదేశించింది. ఫిబ్రవరి 15వ తేదీలోగా ఆడిట్ పూర్తి చేసే అవకాశం కనిపిస్తోంది. ఆడిట్‌లో భాగంగా వీఎస్ఆర్ కంపెనీకి చెందిన బ్యాలెన్స్ షీట్స్, లాగ్ బుక్స్‌ను అధికారులు చెక్ చేయనున్నారు. ఈ చెకింగ్స్ ద్వారా ప్రమాదానికి గురైన విమానానికి సంబంధించిన మెయిన్‌టెన్స్ వివరాలు తెలుసుకోనున్నారు. ప్రోటోకాల్ ప్రకారం లాగ్ బుక్ ఫిల్ చేస్తున్నారా? లేదా గుర్తించనున్నారు. మరో వైపు ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (ఏఏఐబీ) కూడా ప్రమాదానికి గల కారణాలను అన్వేషిస్తోంది.
కాగా, అజిత్ పవార్ లియర్‌జెట్ 45XR విమానంలో ప్రయాణిస్తూ ప్రమాదానికి గురయ్యారు. ఈ లియర్‌జెట్ 45XR విమానం వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందినది. విమానాలను అద్దెకు ఇచ్చే అతి పెద్ద సంస్థలలో వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కూడా ఒకటి. ప్రమాదం జరిగిన తర్వాత సంస్థ యజమాని వీకే సింగ్ మీడియాతో మాట్లాడుతూ.. ‘నా దగ్గర ఉన్న విమానాలు అన్నీ చాలా మంచి కండీషన్‌లో ఉన్నాయి. అలాంటి వాటిని ఎందుకు నిలిపివేస్తాను. లియర్‌జెట్ విమానాలకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరుంది. అలాంటి వాటిని నేను కచ్చితంగా నిలిపివేయను’ అని స్పష్టం చేశారు.
ఇంతకీ ఏం జరిగిందంటే..
అజిత్ అనంతరావు పవార్ జనవరి 28వ తేదీన బారామతిలో జరిగే ఓ కార్యక్రమానికి వీఎస్ఆర్ ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన లియర్‌జెట్ 45XR విమానంలో బయలుదేరారు. బారామతి ఎయిర్‌పోర్టు వద్ద విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ల్యాండ్ కావాల్సిన విమానం మళ్లీ గాల్లోకి లేచింది. ఉదయం 8.45 గంటల సమయంలో నేలపై పడి పేలిపోయింది. అజిత్ పవార్‌తో పాటు మరో నలుగురు ఈ ప్రమాదంలో చనిపోయారు.
ఇవి కూడా చదవండి
అలా అయితే ఈ దేశం నుంచి వెళ్లిపొండి.. మెటా ప్రతినిధులకు సుప్రీంకోర్టు వార్నింగ్..
రోగి గొంతులో జలగ.. అలా జరిగి ఉంటే ప్రాణాలు పోయేవి..