అలా అయితే ఈ దేశం నుంచి వెళ్లిపోండి.. మెటా ప్రతినిధులకు సుప్రీంకోర్టు వార్నింగ్..
ABN , Publish Date - Feb 03 , 2026 | 12:05 PM
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌పై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది.
ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌పై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాట్సాప్ ప్రైవసీ పాలసీపై అసహనం వ్యక్తం చేసింది. భారత్‌లో కార్యకలాపాలు సాగించాలంటే ఇక్కడి చట్టాలను పాటించి తీరాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ మేరకు వాట్సాప్ మాతృసంస్థ మెటాకు మంగళవారం సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరిక జారీ చేసింది (Chief Justice on Meta).
'మా దేశ గోప్యతతో మీరు ఆడుకోలేరు. మా డేటాకు సంబంధించి ఒక్క అంకెను పంచుకోవడానికి కూడా మిమ్మల్ని అనుమతించము' అని అమెరికాకు చెందిన మెటాను సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ మందలించారు. దేశ చట్టాలను పాటించకపోతే భారతదేశం విడిచి వెళ్లాల్సి ఉంటుందని హెచ్చరించారు. వాట్సాప్ 2021 ప్రైవసీ పాలసీకి సంబంధించిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తాజాగా విచారించింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగదారుల డేటాను పంచుకోవడం దోపిడీ అని ప్రభుత్వం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదించారు (WhatsApp policy row).
దేశంలోని లక్షలాది మంది పేదలు, చదువురాని ప్రజలు ప్రైవసీ పాలసీని అర్థం చేసుకోగలరా అని మెటా ప్రతినిధులను చీఫ్ జస్టిస్ సూటిగా ప్రశ్నించారు (Exit India warning). కొన్ని సందర్భాల్లో మెటా పాలసీలు అర్థం చేసుకోవడం తమకే ఇబ్బందిగా మారుతోందని, అలాంటప్పుడు గ్రామీణ భారత దేశ ప్రజలకు ఎలా అర్థం అవుతుందని ప్రశ్నించారు. కాగా, మెటా ఇంజినీరింగ్ బృందం ఇతరుల వాట్సాప్ మెసేజ్‌లను చదవగలదని వాట్సాప్ అంతర్జాతీయ వినియోగదారుల బృందం ఇటీవల అమెరికా కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో తాజాగా సుప్రీంకోర్టు హెచ్చరికలు మెటాను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేస్తున్నాయి.
ఇవి కూడా చదవండి..
హాస్పిటల్‌లో కాబోయే భర్త.. పెళ్లి కూతురి ఏడుపు.. పోలీసులు విచారణ చేస్తే..
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..