హాస్పిటల్‌లో కాబోయే భర్త.. పెళ్లి కూతురి ఏడుపు.. పోలీసులు విచారణ చేస్తే..
ABN , Publish Date - Feb 03 , 2026 | 07:13 AM
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి కారులో బయలుదేరి వెళ్తున్న వరుడిపై మార్గమధ్యంలో దాడి జరిగింది. కొందరు దుండగులు కారుని అడ్డగించి వరుడిపై దాడికి దిగారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు.
కర్ణాటకలో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పెళ్లి మండపానికి కారులో బయలుదేరి వెళ్తున్న వరుడిపై మార్గమధ్యంలో దాడి జరిగింది. కొందరు దుండగులు కారుని అడ్డగించి వరుడిపై దాడికి దిగారు. కత్తులతో విచక్షణారహితంగా పొడిచి పారిపోయారు. తీవ్ర గాయాలతో ఉన్న పెళ్లి కొడుకును హాస్పిటల్‌కు తరలించారు. అక్కడకు చేరుకున్న పెళ్లి కూతురు కన్నీరుమున్నీరుగా విలపించింది. ఆమె ఓవరాక్షన్ పోలీసులకు అనుమానం కలిగించింది. తీగ లాగితే.. డొంకంతా కదిలింది (wedding crime news).
కర్ణాటకలోని కొళ్లేగాల పట్టణానికి చెందిన రవీశ్ (34)కు, నవీన అనే యువతితో వివాహం నిశ్చయమైంది. గత వారం పెళ్లి మండపానికి వెళ్తున్న రవీశ్‌పై మార్గమధ్యంలో దాడి జరిగింది. దర్శన్ అనే యువకుడు మరో ఇద్దరితో కలిసి రవీశ్‌పై దాడి చేశాడు. ముగ్గురూ అతడిని కత్తులతో పొడిచి పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న రవీశ్‌ను స్థానికులు వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది (bride tries to kill groom).
హాస్పిటల్‌కు చేరుకున్న నయన కన్నీరు మున్నీరుగా విలపించింది (wedding incident). గాయాలు తగ్గిన తర్వాత తననే పెళ్లి చేసుకోవాలని వేడుకుంది. విచారణ ప్రారంభించిన పోలీసులకు నయన మీద అనుమానం వచ్చింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభిస్తే నిజం అంగీకరించింది. దర్శన్‌తో నయన చాలా రోజులుగా ప్రేమలో ఉందని బయటపడింది. దర్శన్‌తో కలిసి ఉండడం కోసమే రవీశ్‌ను చంపాలని నయన నిర్ణయించుకుంది. అయితే అదృష్టవశాత్తూ రవీశ్ ప్రాణాలతో బయటపడ్డాడు.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్‌లో.. రాష్ట్రానికి 10134 కోట్లు