Share News

CM Chandrababu Congratulate: హంపి, అర్జున్‌లకు సీఎం చంద్రబాబు అభినందనలు

ABN , Publish Date - Dec 29 , 2025 | 12:05 PM

ఎఫ్ఐడీఈ ( FIDE) వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి తమ సత్తా చాటారు.

CM Chandrababu Congratulate: హంపి, అర్జున్‌లకు సీఎం చంద్రబాబు అభినందనలు

అమరావతి, డిసెంబర్ 29: ఎఫ్ఐడీఈ ( FIDE) వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన చెస్ క్రీడాకారులు కోనేరు హంపి, అర్జున్ ఎరిగైసి తమ సత్తా చాటారు. ఈ పోటీల్లో వీరు కాంస్య పతకాలను గెలుచుకున్నారు. ఈ సందర్భంగా వీరికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందనలు తెలియజేశారు. తన ఎక్స్ ఖాతా వేదికగా వీరిద్దరికి వేర్వేరుగా ఆయన అభినందనలు తెలిపారు. ఎఫ్ఐడీఈ వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న కోనేరు హంపికి అభినందనలు చెప్పారు.


ఒక ఫలితంతో ఛాంపియన్‌లను నిర్వచించరని.. అత్యున్నత స్థాయిలో మళ్లీ మళ్లీ పోటీ పడే ధైర్యం ద్వారా నిర్వచించవచ్చునని ఆయన పేర్కొన్నారు. ప్రపంచ వేదికపై కాంస్య పతకం సాధించడం ద్వారా నిజమైన ప్రతిభ ప్రతిబింబించిందన్నారు. స్థిరమైన మీ ప్రయాణం లక్షలాది మంది భారతీయులకు గర్వ కారణమే కాకుండా స్ఫూర్తిదాయకమని కోనేరు హంపీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.


ఎఫ్ఐడీఈ వరల్డ్ రాపిడ్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్య పతకం గెలుచుకున్న అర్జున్ ఎరిగైసికి సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. ప్రముఖ చెస్ ఛాంపియన్ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథ్ ఆనంద్‌ తర్వాత ఈ ఘనత సాధించిన ఏకైక భారతీయ పురుష ఆటగాడు అర్జున్ ఎరిగైసి అని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ పుత్రుడైన అర్జున్ భారతదేశ విశిష్ట చెస్ వారసత్వానికి మరో గర్వకారణమైన అధ్యాయనానికి శ్రీకారం చుట్టారంటూ అర్జున్‌‌ను సీఎం చంద్రబాబు ప్రశంసించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

అసెంబ్లీ చేరుకున్న కేసీఆర్.. స్వాగతం పలికిన పార్టీ ఎమ్మెల్యేలు

చలితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి

For TG News and Telugu News

Updated Date - Dec 29 , 2025 | 01:03 PM