KCR In TG Assembly: అసెంబ్లీ చేరుకున్న కేసీఆర్.. స్వాగతం పలికిన పార్టీ ఎమ్మెల్యేలు
ABN , Publish Date - Dec 29 , 2025 | 10:34 AM
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, ప్రతిపక్ష నేత కేసీఆర్ హాజరయ్యారు. అందుకోసం అసెంబ్లీకి చేరుకున్న ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు.
హైదరాబాద్, డిసెంబర్ 28: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయనకు పార్టీ ఎమ్మెల్యేలు స్వాగతం పలికారు. అనంతరం అసెంబ్లీలోకి ;;పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి కేసీఆర్ వెళ్లారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లో అధికార కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేందుకు ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ వ్యూహాతక్మంగా వ్యవహరించనుందని తెలుస్తోంది. అందుకోసం అస్త్రశస్త్రాలను ఆ పార్టీ సిద్ధం చేసుకొంది.
అసెంబ్లీ ఎన్నికల వేళ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలతోపాటు నీటిపారుదల అంశాలు, ప్రాజెక్టుల నిర్మాణంపై వాడివేడిగా చర్చ జరిగే అవకాశం ఉందని సమాచారం. ఈ రోజు జరిగే బీఏసీ సమావేశంలోఈ శీతాకాల సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై ఒక నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు విపక్ష పార్టీల విమర్శలను సమర్థవంతంగా తిప్పికొట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు సైతం ఈ రోజు సమావేశాలకు హాజరుకానున్నారు.
2023 ఏడాది చివరల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తెలంగాణ ఓటరు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాడు. దీంతో పదేళ్ల పాటు తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత ఈ రెండేళ్లలో ఆయన కేవలం రెండు సార్లు మాత్రమే తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టారు.
ఆయన తన ఫామ్ హౌస్‌కే పరిమితమయ్యారు. ఇటీవల ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి సర్కార్‌పై విమర్శలు గుప్పిస్తూ నిప్పులు చెరిగారు. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి మీడియా ముందు స్పందించారు. అసెంబ్లీకి వస్తే అన్ని విషయాలు చర్చిద్దామంటూ కేసీఆర్‌కు సీఎం రేవంత్ రెడ్డి సూచించిన విషయం విదితమే.
అసెంబ్లీ ముట్టడికి పిలుపు..
మరికాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి.. మరణించిన మాజీ ఎమ్మెల్యేలు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, కొండ లక్ష్మణ్‌రెడ్డికి అసెంబ్లీ సంతాపం తెలపనుంది. అనంతరం సభలో పలు ఆర్డినెన్స్‌లను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. అలాగే కృష్ణా, గోదావరి జలాలపై అధికార, విపక్షాలు చర్చించనున్నాయి. ఇంకోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నేపథ్యంలో ఆ పరిసర ప్రాంతాల్లో భారీగా పోలీసులు మోహరించారు. అదీకాక శీతాకాల సమావేశాల దృష్ట్యా పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీని ముట్టడికి మాజీ సర్పంచ్‌లు పిలుపునిచ్చారు. దాంతో ముందస్తుగా మాజీ సర్పంచ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
హద్దు మీరితే చర్యలు తప్పవు: నగర సీపీ
చలితో తెలుగు రాష్ట్రాలు ఉక్కిరిబిక్కిరి
For TG News and Telugu News