Anagani Satyaprasad: పీపీపీ విధానంపై వైసీపీది అసత్య ప్రచారం..మంత్రి అనగాని ఫైర్
ABN , Publish Date - Dec 16 , 2025 | 01:32 PM
తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని పేర్కొన్నారు.
బాపట్ల జిల్లా, డిసెంబరు16 (ఆంధ్రజ్యోతి):వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ (AP Minister Anagani Satyaprasad) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మెడికల్ కాలేజీల నిర్మాణంలో పీపీపీ విధానంపై వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇవాళ(మంగళవారం) రేపల్లెలో పర్యటించారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో రేపల్లెలో 41 మందికి సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం మాట్లాడారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
జగన్ హయాంలో పీపీపీ విధానంలో అయితే మెడికల్ కాలేజీల నిర్మాణానికి 25 ఏళ్లు పట్టేదని విమర్శించారు. కానీ వైసీపీ నేతలు వంద సంతకాల పేరుతో సిగ్గు లేకుండా తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. జగన్‌కు అసలు రుషికొండపై ఉన్న శ్రద్ధ మెడికల్ కాలేజీల నిర్మాణంపై ఉందా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు. పులివెందులలో కూడా మెడికల్ కాలేజీ నిర్మించలేకపోయిన అసమర్థుడు జగన్ అని ఎద్దేవా చేశారు మంత్రి అనగాని సత్య ప్రసాద్.
జగన్ ఐదేళ్ల పాలనలో రూ.500 కోట్లు ఖర్చు పెట్టి ఐదు మెడికల్ కాలేజీలు కూడా కట్టలేకపోయారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రేపల్లె నియోజకవర్గంలో సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 కోట్లు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. పీపీపీ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా హర్షించిందని పేర్కొన్నారు. తమ ప్రభుత్వంలో పీపీపీ విధానంలో రెండేళ్లలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టామని తెలిపారు. అదనంగా ఉచిత, ఎన్ఆర్ఐ సీట్లు పెరుగుతున్నాయని మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భక్తులకు అలర్ట్.. ఆ సేవ రద్దుపై టీటీడీ కీలక ప్రకటన
టీటీడీ పరకామణి కేసు.. హైకోర్టు కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News