AP Assembly on NALA Act: ఏపీ శాసనసభలో నాలా యాక్ట్ రద్దు బిల్లుకు ఏకగ్రీవ ఆమోదం
ABN , Publish Date - Sep 26 , 2025 | 02:59 PM
నాలా యాక్ట్ రద్దు బిల్లుపై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ శాసనసభలో చర్చించారు. నాలా యాక్ట్ రద్దు అవసరాన్ని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ వివరించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే నాలా యాక్ట్ రద్దు చేయాలని మంత్రి అనగాని సత్యప్రసాద్ సూచించారు.
అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): నాలా యాక్ట్ (NALA ACT) రద్దు బిల్లుపై ఆంధ్రప్రదేశ్ శాసనసభలో (AP Assembly) ఇవాళ(శుక్రవారం) చర్చించారు. నాలా యాక్ట్ రద్దు అవసరాన్ని రెవెన్యూ శాఖా మంత్రి అనగాని సత్యప్రసాద్ (Anagani Satya Prasad) వివరించారు. ఏపీలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (Ease of Doing Business)ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకే నాలా యాక్ట్ రద్దు చేయాలని సూచించారు. భూమి అభివృద్ధికి ఇప్పటికే వివిధ స్థానిక సంస్థలు, పట్టణాభివృద్ధి సంస్థల సంబంధిత చట్టాలతో నియంత్రణ సాధ్యమని చెప్పుకొచ్చారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
నాలా యాక్ట్ కారణంగా ఎవరైనా వ్యవసాయేతర భూమికి అనుమతి తెచ్చుకోవడం పెద్ద సమస్యగా మారిందని వివరించారు. నాలా యాక్ట్ వల్ల భూ యజమానులు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని తెలిపారు. సంబంధిత అధికారులు ఇతర పనుల్లో నిమగ్నమై ఉండటంతో అనుమతులు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతోందని వెల్లడించారు మంత్రి అనగాని సత్యప్రసాద్.
నాలా యాక్ట్ వల్ల బిల్డింగ్స్, ఇండస్ట్రీస్ నిర్మాణంలో జాప్యం జరుగుతోందని తెలిపారు. మొత్తంగా ఏపీ ఆర్థికాభివృద్దికి ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు. నాలా యాక్ట్‌ను రద్దు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో కూడా ప్రకటించారని గుర్తుచేశారు. సీఎం ఆదేశాల మేరకు ఈ చట్టాన్ని రద్దు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. అనంతరం నాలా యాక్ట్ రద్దు బిల్లుకు శాసనసభ ఏకగ్రీవంగా ఆమోదించింది.
ఈ వార్తలు కూడా చదవండి..
వైసీపీ కీలక నేత కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం
Read latest AP News And Telugu News