Share News

AP High Court ON YSRCP Leader Case: వైసీపీ కీలక నేత కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు

ABN , Publish Date - Sep 26 , 2025 | 02:34 PM

వైసీపీకి చెందిన తాడేపల్లి నేత సవింద్ర రెడ్డి పిటిషన్‌పై శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టులో విచారణ జరిగింది. విచారణ అనంతరం సవింద్ర రెడ్డి అక్రమ నిర్బంధం కేసును ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది.

AP High Court ON YSRCP Leader Case: వైసీపీ కీలక నేత కేసును సీబీఐకి అప్పగించిన హైకోర్టు
AP High Court ON YSRCP Leader Case

అమరావతి, సెప్టెంబరు 26 (ఆంధ్రజ్యోతి): వైసీపీకి చెందిన తాడేపల్లి నేత సవింద్ర రెడ్డి (YSRCP Leader Savindra Reddy) పిటిషన్‌పై ఇవాళ(శుక్రవారం) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హై కోర్టు (AP High Court) లో విచారణ జరిగింది. విచారణ అనంతరం సవింద్ర రెడ్డి అక్రమ నిర్బంధం కేసు (Illegal Detention Case)ను ఏపీ హైకోర్టు సీబీఐకి అప్పగించింది. పోలీసులు చెప్పిన వైఖరికి, టవర్ లొకేషన్‌కు అసలు సంబంధం లేదని వ్యాఖ్యానించింది న్యాయస్థానం. అయితే, తాడేపల్లికి చెందిన సవింద్ర రెడ్డిని పోలీసులు అక్రమంగా నిర్బంధించారని హైకోర్టులో ఆయన సతీమణి హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్‌పై విచారణ జరిపింది హైకోర్టు.


సవింద్ర రెడ్డిపై గంజాయి కేసు ఉందని పోలీసులు చెప్పారు. అయితే హెబియస్ కార్పస్ పిటిషన్‌పై విచారణ జరిపి అతనిని వెంటనే ఫ్రీగా వదిలివేయాలని ఆదేశించింది హైకోర్టు. ఈ రోజు(శుక్రవారం) సవింద్ర రెడ్డిని న్యాయస్థానంలో హాజరు కావాలని ఆదేశించింది హైకోర్టు. అయితే అతని మొబైల్ టవర్ లొకేషన్‌కు, పోలీసులు చెప్పే వైఖరి‌కి సంబంధం లేదని భావించింది న్యాయస్థానం. అందువల్లే ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించినట్లు హైకోర్టు స్పష్టం చేసింది.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫీవర్‌తో బాధపడుతున్న పవన్

మండలిలో అచ్చెన్న, బొత్స మధ్య మాటల యుద్ధం

Read latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2025 | 02:39 PM