Share News

CP Sajjanar: ఇదీ హైదరాబాద్ అంటే.. సీపీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:36 AM

హైదరాబాద్ ప్రజలను సీపీ సజ్జనార్ అభినందించారు. న్యూతన సంవత్సరం వేళ ప్రజలు ఎంతో బాధ్యతాయుతంగా ప్రవర్తించారని తెలిపారు. నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయన్నారు.

CP Sajjanar: ఇదీ హైదరాబాద్ అంటే.. సీపీ సజ్జనార్ ఆసక్తికర పోస్ట్
CP Sajjanar

హైదరాబాద్, జనవరి 1: 2026 నూతన సంవత్సరానికి అందరూ ఎంతో గ్రాండ్‌గా స్వాగతం పలికారు. న్యూఇయర్ సెలబ్రేషన్‌ సందర్భంగా పోలీసులు ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు. ఎలాంటి ప్రమాదాలు జరుగకుండా ముందుస్తుగానే ప్రజలను అలెర్ట్‌ చేశారు. దీంతో గత రాత్రి న్యూఇయర్ సెలబ్రేషన్స్‌ ఎలాంటి గొడవలు, ప్రమాదాలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. దీనిపై సీపీ సజ్జనార్ (CP Sajjanar) సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా స్పందిస్తూ.. హైదరాబాద్‌కు ధన్యవాదాలు చెబుతూ.. ప్రమాదాల్లేని నూతన సంవత్సరం అంటూ పోస్ట్ చేశారు. న్యూఇయర్ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయన్నారు. బాధ్యతాయుతంగా ప్రవర్తించిన ప్రజలకు సీపీ అభినందనలు తెలియజేశారు.


సజ్జనార్ ట్వీట్..

‘హైదరాబాద్‌కు ధన్యవాదాలు – ప్రమాదాల్లేని నూతన సంవత్సరం! నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అనర్థాలు చోటు చేసుకోలేదు. నగరమంతటా డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠినమైన తనిఖీలు. పోలీసుల కట్టుదిట్టమైన అమలు చర్యలు ఫలితమిచ్చాయి. ప్రజల్లో అవగాహన పెరగడం వల్లే ఈ విజయం. పౌరుల బాధ్యతాయుతమైన ప్రవర్తనకు అభినందనలు. మద్యం సేవించి వాహనం నడపకుండా ప్రజలు స్వచ్ఛందంగా సహకారం. హైదరాబాద్ మరోసారి సురక్షిత నగరమని నిరూపించింది. ప్రమాదాల్లేని వేడుకలు సాధ్యమేనని నగరం చూపించింది. పోలీస్ శాఖ – ప్రజల సమన్వయానికి ఇదే ఉత్తమ ఉదాహరణ. హైదరాబాద్‌ను మరింత సురక్షితమైన, గ్లోబల్ సిటీగా మార్చేందుకు కలిసి ముందుకు సాగుదాం. హైదరాబాద్ నేర్పింది ఒక్కటే. సెలబ్రేషన్ ఉండొచ్చు… కానీ రిస్క్ లేకుండా!’ అంటూ సీపీ సజ్జనార్ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.


ఇవి కూడా చదవండి...

తెలంగాణ భవన్‌కు కేటీఆర్..

మందుబాబులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. భారీగా కేసులు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 10:41 AM