KTR: తెలంగాణ భవన్‌కు కేటీఆర్..
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:56 AM
తెలంగాణ భవన్‌లో ఈ ఏడాది బీఆర్ఎస్ పార్టీ డైరీతోపాటు న్యూ ఇయర్ క్యాలండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు.
హైదరాబాద్, జనవరి 01: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్‌కు రానున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా గురువారం ఉదయం11.00 గంటలకు బంజారాహిల్స్‌లోని తెలంగాణ భవన్‌కు ఆయన చేరుకోనున్నారు. అనంతరం 2026 బీఆర్ఎస్ పార్టీ డైరీతోపాటు న్యూ ఇయర్ క్యాలండర్‌ను కేటీఆర్ ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత పార్టీ నేతలు, కార్యకర్తలతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్టీ కేడర్‌ను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అలాగే పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం ఈ రోజు తెలంగాణ భవన్‌కు చేరుకుని.. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తోపాటు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీశ్ రావుకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయనున్నారు.
కొత్త సంవత్సరం సందర్భంగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు తెలంగాణ భవన్‌కు చేరుకోనున్నారు. మరోవైపు.. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో కేటీఆర్ సమావేశం అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. శుక్రవారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. మరి ఈ సమావేశాలకు బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ హాజరవుతారా? లేదా? అనే అంశంపై పార్టీ నేతల్లో కొంత సందిగ్ధత నెలకొన్నట్లు సమాచారం. దీనిపై వారికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందనే ప్రచారం సాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ప్రజాభవన్‌కు..
ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..
For More TG News And Telugu News