CM Revanth Reddy: లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ప్రజాభవన్‌కు..
ABN , Publish Date - Jan 01 , 2026 | 08:15 AM
ప్రజాభవన్‌లో ఈ రోజు సాయంత్రం జలాలు, నిజాలపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు.
హైదరాబాద్, జనవరి 01: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలపనున్నారు. అందుకోసం గురువారం ఉదయం 10.30 గంటలకు లోక్‌భవన్ (రాజ్‌భవన్)కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. అనంతరం సెక్రటేరియట్‌కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. హైదరాబాద్ ప్రెస్ క్లబ్, టీయూడబ్ల్యూజే డైరీని ఆయన ఆవిష్కరించనున్నారు. ఆ తర్వాత సెక్రటేరియట్‌లో సందర్శకులను కలవనున్నారు.
సాయంత్రం బేగంపేటలోని ప్రజాభవన్‌కు ఆయన వెళ్లనున్నారు. సాయంత్రం 4.00 గంటలకు ప్రజాభవన్‌లో జలాలు, నిజాలపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. దీనిలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనున్నారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కార్యక్రమానికి అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతోపాటు పలువురు సీనియర్ నేతలు హాజరుకానున్నారు.
మరోవైపు తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం అంటే.. డిసెంబర్ 29వ తేదీన ప్రారంభమైనాయి. ఆ రోజు జరిగిన బీఏసీ సమావేశంలో ఈ సమావేశాలు జనవరి 2 నుంచి 7వ తేదీ వరకు జరపాలని నిర్ణయించారు. ఈ సమావేశాల వేదికగా ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు అమలు, రాష్ట్రానికి చెందిన జాలాల వాట, నీళ్ల ప్రాజెక్ట్‌ల అంశాలపై నిలదీయాలని ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ భావిస్తోంది. అందుకు సంబంధించిన ఆస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకొంటుంది. అదీకాక.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నదిపై ప్రాజెక్టు నిర్మాణానికి సన్నద్ధమవుతుందంటూ ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది.
అందుకు సంబంధించిన ఏపీ ప్రభుత్వంపై పలు విమర్శలు సైతం ఆ పార్టీ గుప్పించింది. ఈ విషయంలో అధికార రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుందంటూ బీఆర్ఎస్ మండిపడుతుంది. ఈ నేపథ్యంలో నీళ్లు, నిజాలు అంశంపై ప్రజా ప్రతినిధులతోపాటు ప్రజలకు తెలియాలని రేవంత్ రెడ్డి సర్కార్ భావిస్తోంది. అందుకోసం ఈ రోజు సాయంత్రం ప్రజా భవన్‌లో నీళ్లు, నిజాలపై భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయనున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..
పోలీసులకు ‘నూతన ఏడాది’ పురస్కారాలు
For More TG News And Telugu News