Telangana Government: పోలీసులకు ‘నూతన ఏడాది’ పురస్కారాలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:41 AM
విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 630 మంది పోలీసులకు నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పతకాలు ప్రకటించింది.
630 పతకాలు ప్రకటించిన ప్రభుత్వం
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి) : విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన 630 మంది పోలీసులకు నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం పతకాలు ప్రకటించింది. ఇందులో ముఖ్యమంత్రి సర్వోన్నత సేవా పతకానికి ఇంటెలిజెన్స్ విభాగంలో సబ్ ఇన్స్‌పెక్టర్‌గా పనిచేస్తున్న మహేష్ కుమార్ లఖాని ఎంపికయ్యారు. ఆయనకు రూ.5 లక్షల రివార్డు ఇస్తున్నట్లు హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆనంద్ బుధవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వివిధ విభాగాల్లో పనిచేస్తున్న ఇతర పోలీసు అధికారులకు 7 శౌర్యపతకాలు, 53 కఠిన సేవాపతకాలు, 16 మహోన్నత సేవా పతకాలు, 94 ఉత్తమ సేవా పతకాలు, 459 సేవా పతకాలు ప్రకటించారు.