Share News

Smoke Snow: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. భారీగా పొగమంచు

ABN , Publish Date - Jan 01 , 2026 | 10:24 AM

తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. ఏపీ, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో చలి భయంతో ప్రజలు బయటకు వెళ్లేందుకు భయపడుతున్నారు. ఉదయం పొగమంచు కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

Smoke Snow: తెలుగు రాష్ట్రాల్లో రికార్డు స్థాయిలో పడిపోయిన ఉష్ణోగ్రతలు.. భారీగా పొగమంచు
Telangana Cold Wave

తెలంగాణ, జనవరి 1: ఏపీ, తెలంగాణా రాష్ట్రాలు చలి(cold) గుప్పిట్లో చిక్కుకున్నాయి. ఎన్నడూలేని విధంగా గత నెలరోజుల నుంచి ఏజెన్సీ ప్రాంతాల్లో (agency areas) చలి తీవ్రత పెరిగిపోవడంతో ప్రజలు వణికిపోతున్నారు. ప్రస్తుతం.. తెలంగాణ వ్యాప్తంగా సాధారణం కంటే 3 నుంచి 5 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు(Temperatures) నమోదవుతున్నాయి. తెలంగాణ(Telangana ) వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో దట్టమైన పొంగమంచు కురియడంతో వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.


ఉమ్మడి మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. కోహిర్, సిర్పూర్ ప్రాంతాల్లో నెల రోజులుగా 5 నుంచి 6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, హన్మకొండ, సిద్దిపేట, జనగాం, మెదక్, రంగారెడ్డి, కామారెడ్డి జిల్లాల్లో చలి తీవ్రత బాగా పెరిగిపోయింది. నగర శివారు ప్రాంతాల్లోనూ పరిస్థితి అత్యంత దారుణంగా ఉంది. అక్కడి ప్రాంతాల్లో 8 నుంచి 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.


ఇక.. ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లోని పలు జిల్లాల్లో విపరీతమైన చలి ప్రభావం కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో కొస్తాంధ్ర, యానాం, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దక్షిణ తీర ప్రాంతాల్లోనూ కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు పడే అవకాశముందని ఐఎండీ అంచనా వేస్తోంది. జనవరి 1 తర్వాత వాతావరణంలో చాలా మార్పులు ఉండే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో మధ్యాహ్నం కూడా విపరీతంగా చలి తీవ్రత కనిపిస్తోంది. ఉత్తర భారతదేశం నుంచి చల్లటి పవనాలు వీడయడం వల్లనే ఉష్ణోగ్రతలు తగ్గాయని ఐఎండీ పేర్కొంది.


ఈ వార్తలు కూడా చదవండి..

లోక్‌భవన్‌కు సీఎం రేవంత్ రెడ్డి.. అనంతరం ప్రజాభవన్‌కు..

ఇలా చేయండి.. మీరే నెంబర్ వన్..

For More AP News And Telugu News

Updated Date - Jan 01 , 2026 | 11:31 AM