Drunk and Drive: మందుబాబులకు షాక్ ఇచ్చిన పోలీసులు.. భారీగా కేసులు
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:28 AM
న్యూఇయర్ వేళ మందుబాబులకు పోలీసులు షాక్ ఇచ్చారు. హైదరాబాద్‌లో పోలీసులు పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్, జనవరి 1: కొత్త సంవత్సరం వచ్చేసింది. ఎంతో గ్రాండ్‌గా నూతన సంవత్సరానికి వెల్‌కమ్ చెప్పాం. న్యూ ఇయర్ సందర్భంగా అర్ధరాత్రి సంబరాలు అంబరాన్నంటాయి. ఈ వేడుకల్లో యువత ఆడి పాడి చిందులేశారు. అయితే న్యూ ఇయర్ వేళ పోలీసులు విధించిన పలు ఆంక్షలను కొంతమంది బ్రేక్ చేశారు. మద్యం సేవించి వాహనం నడపరాదని, అర్ధరాత్రి వేళల్లో రోడ్లపై తిరగవద్దని పదే పదే పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. కానీ, మందుబాబులు మాత్రం అందుకు విరుద్ధంగా ప్రవర్తించారు. ఫుల్‌గా మద్యం సేవించి చిందులు వేశారు, ఆ తర్వాత రోడ్లపై బైక్ డ్రైవింగ్ చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్‌లో అడ్డంగా బుక్కయ్యారు. వివరాల్లోకెళితే...
హైదరాబాద్ నగర శివారులో న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పెద్దఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేశారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో కేసులు నమోదు అయ్యాయి. ఒక్క హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే 1,198 మందిపై కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. గత రాత్రి నుంచి ఈరోజు (గురువారం) తెల్లవారుజాము వరకు ప్రత్యేక తనిఖీలు కొనసాగాయి. తనిఖీల్లో భాగంగా పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News And Telugu News