Share News

Sikandar Raja: స్టార్ క్రికెటర్ ఇంట విషాదం.. సోదరుడు మృతి

ABN , Publish Date - Jan 01 , 2026 | 07:41 AM

జింబాబ్వే స్టార్‌ క్రికెటర్‌, టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా సోదరుడు మహ్మద్‌ మహ్ది కన్నుమూశాడు. అతడు అరుదైన హీమోఫీలియా వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడు.

Sikandar Raja: స్టార్ క్రికెటర్ ఇంట విషాదం.. సోదరుడు మృతి
Sikandar Raja

ఇంటర్నెట్ డెస్క్: ఇటీవల కాలంలో సినీ, రాజకీయ, క్రీడా రంగంలో విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. పలువురు సెలబ్రిటీలు వివిధ కారణాలతో కన్నుమూశారు. అలానే మరికొందరు ప్రముఖుల కుటుంబంలోని సభ్యులు మృతిచెందారు. ఇటీవలే మలయాళ నటుడు మోహన్‌లాల్ తల్లి శాంతకుమారి మరణించారు. తాజాగా ఓ స్టార్ క్రికెటర్(Zimbabwe Cricketer) ఇంట కూడా విషాదం చోటుచేసుకుంది. జింబాబ్వే స్టార్‌ క్రికెటర్‌, టీ20 జట్టు కెప్టెన్‌ సికందర్‌ రజా(Sikandar Raja) చిన్న తమ్ముడు మహ్మద్‌ మహ్ది(13) కన్నుమూశాడు. అతడు అరుదైన హీమోఫీలియా వ్యాధి బాధపడుతూ మృతి చెందాడని స్థానిక మీడియా తెలిపింది.


హీమోఫీలియా కారణంగా మహ్మద్‌ మహ్ది శరీరంలో రక్తం గడ్డకట్టే సామర్థ్యం తగ్గిపోయింది. ఈ కారణంగా ఆరోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఇటీవల అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గతేడాది డిసెంబర్ 29న మహ్దిని హరారేలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ(Younger Brother Passes Away) కన్నుమూశాడు. ఆ మరుసటి రోజే(డిసెంబర్‌ 30) మహ్ది అంత్యక్రియలు హరారేలోని వారెన్ హిల్స్ స్మశానవాటికలో నిర్వహించారు రజా కుటుంబ సభ్యులు. చిన్న వయసులోనే సోదరుణ్ని కోల్పోవడంతో రజా తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. రజా(Sikandar Raja) కుటుంబానికి జింబాబ్వే క్రికెట్ బోర్డు సానుభూతి తెలిపింది. అంతేకాక పలువురు అంతర్జాతీయ క్రికెటర్లు కూడా అతడికి వివిధ మాధ్యమాల ద్వారా తమ సానుభూతిని ప్రకటించారు.


సికందర్‌ రజా పాకిస్థాన్‌లోని సియాల్‌కోట్‌లో జన్మించాడు. ఆ తర్వాత కుటుంబంతో సహా జింబాబ్వేకు వలస వచ్చాడు. కుడిచేతి వాటం స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అయిన రజా(Zimbabwe Cricketer).. తన ప్రతిభతో జింబాబ్వే క్రికెట్‌కు వన్నె తెచ్చాడు. పరిమిత ఓవర్ల ఫార్మాట్‌లో రజా(Sikandar Raja) ప్రపంచ వ్యాప్తంగా అ‍గ్రశ్రేణి ఆల్‌రౌండర్లతో పోటీపడ్డాడు. జింబాబ్వే తరఫున తొలి టీ20 సెంచరీ చేసిన బ్యాటర్‌గా రజా గుర్తింపు పొందాడు. ఇటీవలే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో నంబర్‌ వన్‌ ఆల్‌రౌండర్‌గా అవతరించాడు.



ఇవీ చదవండి:

న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!

దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!

Updated Date - Jan 01 , 2026 | 08:10 AM