Sports Extravaganza in 2026: 2026 ఆటలే ఆటలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:00 AM
గతేడాది చదరంగంలో భారత్ అద్భుత ఫలితాలు రాబట్టింది. మహిళల చెస్ వరల్డ్‌క్‌పలో దివ్యా దేశ్‌ముఖ్ చాంపియన్‌గా నిలవగా, కోనేరు హంపి రన్నరప్ ట్రోఫీ అందుకుంది...
చదరంగంలో మళ్లీ వెలగాలని..
గతేడాది చదరంగంలో భారత్ అద్భుత ఫలితాలు రాబట్టింది. మహిళల చెస్ వరల్డ్‌క్‌పలో దివ్యా దేశ్‌ముఖ్ చాంపియన్‌గా నిలవగా, కోనేరు హంపి రన్నరప్ ట్రోఫీ అందుకుంది. ఇక, ఏడాది ఆఖర్లో జరిగిన ఫిడే ప్రపంచ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షి్‌పలో హంపి కాంస్యం, యువ ఆటగాడు అర్జున్ ఇరిగేసి రెండు కంచు పతకాలతో సత్తాచాటారు. చెస్‌లో మన ఆధిపత్యాన్ని చాటిచెప్పేందుకు కొత్త ఏడాదిలో క్యాండిడేట్స్, చెస్ ఒలింపియాడ్, వరల్డ్ చెస్ చాంపియన్‌షి్‌పలాంటి మెగా టోర్నీలు సిద్ధంగా ఉన్నాయి.
క్రీడా క్యాలెండర్
క్రికెట్, ఫుట్‌బాల్, బ్యాడ్మింటన్, హాకీ, చదరంగం.. ఇలా 2026లో ఆటలే ఆటలు.. ప్రపంచ టోర్నీల సందడే సందడి! క్రికెట్‌లో భారత పురుషుల యువ, సీనియర్ జట్లు ప్రపంచకప్‌లో సమరానికి సన్నద్ధమవుతున్నాయి. భారత్ వేదికగా టీ20 ప్రపంచక్‌పతో ఈ క్రీడా సీజన్‌కు ఘనమైన ఆరంభం లభించనుంది. బ్యాడ్మింటన్‌లో జోరు కొనసాగించేందుకు ప్రపంచ చాంపియన్‌షి్‌ప.. లిఫ్టర్లు, షూటర్లు సత్తా చాటేందుకు ఆసియా చాంపియన్‌షి్‌ప, టీటీ క్రీడాకారులకు డబ్ల్యూటీటీ స్టార్ కంటెండర్.. ఇలా ఎన్నో ఈవెంట్ల ఆతిథ్యానికి భారత్ ముస్తాబవుతోంది. ఇవే కాదు.. ఇంకా ఎన్నో క్రీడలు, మరెన్నో పోటీలు..వ్యక్తిగత ప్రతిభ చాటే ఈవెంట్లు, జట్టుగా కలిసి తలపడే టోర్నీలు.. ఇలా భారత్‌తో పాటు విశ్వవ్యాప్తంగా వివిధ దేశాల్లో క్రీడా సంబరాన్ని అందించేందుకు కొత్త ఏడాది ముస్తాబైంది. ఇక, ఆటగాళ్లు బరిలోకి దిగి విజయాలు అందుకోవడమే ఆలస్యం. మరింకేం.. ఫుల్‌జో్‌షతో ఉన్న ఈ ఏడాది క్రీడా క్యాలెండర్‌పై ఓ లుక్కేద్దాం.
టాటా స్టీల్ చెస్ (జనవరి 16-ఫిబ్రవరి 1: నెదర్లాండ్స్); ఫిడే క్యాండిడేట్స్ టోర్నీ (మార్చి 28 - ఏప్రిల్ 15: సైప్రస్); చెస్ ఒలింపియాడ్ (సెప్టెంబరు 4-17: ఉజ్బెకిస్థాన్); ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్ (గుకే్‌ష క్యాండిడేట్స్ విజేత: షెడ్యూల్ ఖరారవ్వాలి); వరల్డ్ ర్యాపిడ్, బ్లిట్జ్ చాంపియన్‌షిప్ (షెడ్యూల్ ఖరారవ్వాలి).
క్రికెట్‌లో మూడు ప్రపంచక్‌పలు
కొత్త ఏడాది పూర్తిగా క్రికెట్ పండుగ అని చెప్పుకోవచ్చు. ఈ బ్యాటు, బంతి క్రీడలో భాగంగా మూడు ప్రపంచక్‌పలు అభిమానులను కనువిందు చేయనున్నాయి. జింబాబ్వే, నమీబియా సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న అండర్-19 50 ఓవర్ల ప్రపంచక్‌పతో పాటు పురుషుల, మహిళల టీ20 ప్రపంచక్‌పలు ఈ ఏడాదిలోనే జరగనున్నాయి. ఈ మెగా టోర్నీలతో పాటు ఇతర జట్లతో టీమిండియా తలపడే వన్డే, టీ20, టెస్టు సిరీ్‌సలు.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్), మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) ఎలాగూ ఉంటాయి.
మహిళల ప్రీమియర్ లీగ్ (జనవరి 9 - ఫిబ్రవరి 5); అండర్-19 వన్డే ప్రపంచకప్ (జనవరి 15 - ఫిబ్రవరి 6: జింబాబ్వే, నమీబియా); పురుషుల టీ20 ప్రపంచకప్ (ఫిబ్రవరి 7-
మార్చి 8: భారత్, శ్రీలంక); ఇండియన్ ప్రీమియర్ లీగ్ (మార్చి 26- మే 31);
మహిళల టీ20 ప్రపంచకప్ (జూన్ 12- జులై 5: ఇంగ్లండ్).
ఇవీ చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
కోమాలో స్టార్ క్రికెటర్.. పరిస్థితి విషమం!