Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ఆ ముగ్గురు స్టార్లు.. ఆడేది ఎప్పుడంటే..?
ABN , Publish Date - Dec 31 , 2025 | 01:09 PM
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రతిష్టాత్మక దేశవాళీ టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే. సెంట్రల్ కాంట్రాక్ట్ ఉన్న ప్రతి ప్లేయర్ దేశవాళీ ఆడాల్సిందేనన్న బీసీసీఐ నిబంధనలతో ఈ సారి టీమిండియా స్టార్ ప్లేయర్లంతా విజయ్ హజారే ఆడుతున్నారు. ఇప్పటికే వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆయా జట్ల తరఫున ఆడి అద్భుత ప్రదర్శనలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ట్రోఫీ(Vijay Hazare Trophy)లో మరో ముగ్గురు స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. వారు ఎవరు..? ఎప్పుడు ఆడబోతున్నారంటే..?
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది. శుభ్‌మన్ గిల్ పంజాబ్ తరఫున జైపుర్ వేదికగా జనవరి 3న సిక్కింతో, 6న గోవాతో జరగనున్న మ్యాచుల్లో పాల్గొనే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పంజాబ్ జట్టు ముడు మ్యాచుల్లో రెండింట విజయం సాధించింది. ఈ రెండు మ్యాచుల అనంతరం గిల్ టీమిండియాతో కలవనున్నాడు.
రవీంద్ర జడేజా కూడా విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా.. జనవరి 6న సర్వీసెస్, 8న గుజరాత్‌తో జరగనున్న మ్యాచుల్లో పాల్గొంటున్నట్లు సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు తెలిపాడు. సౌరాష్ట్ర జట్టు ఇప్పటి వరకు మూడు మ్యాచుల్లో కేవలం ఒక దాంట్లోనే గెలిచింది. కర్ణాటక తరఫున కేఎల్ రాహుల్ జనవరి 3న త్రిపురతో, 6న రాజస్థాన్ జరగనున్న మ్యాచుల్లో పాల్గొనే అవకాశముంది. అయితే ఈ విషయాన్ని కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ ధ్రువీకరించలేదు. కర్ణాటక జట్టు మూడుకు మూడు మ్యాచుల్లో విజయం సాధించింది.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!