Deepti Sharma: దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!
ABN , Publish Date - Dec 31 , 2025 | 09:55 AM
టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ ప్రపంచ రికార్డు సృష్టించింది. టీ20 క్రికెట్‌లో 152 వికెట్లు తీసి.. అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా నిలిచింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా బౌలర్‌ను అధిగమించింది. శ్రీలంకతో ఐదో టీ20లో దీప్తి ఈ ఫీట్ అందుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళల స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మ.. సరికొత్త రికార్డు సృష్టించింది. టీ20 చరిత్రలో 152 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్‌గా ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మంగళవారం శ్రీలంక జట్టులో ఐదో టీ20లో దీప్తి(Deepti Sharma) ఈ ఫీట్ అందుకుంది. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన మేగాన్ షుట్ రికార్డును ఆమె అధిగమించింది.
శ్రీలంకతో జరిగిన ఐదో టీ20లో దీప్తి శర్మ నిలాక్షిక సిల్వాను ఎల్బీడబ్ల్యూ చేసింది. దీంతో ఆమె కెరీర్ 152వ టీ20 వికెట్ తన ఖాతాలో వేసుకుంది. దీనితో ఇప్పటివరకు ఆస్ట్రేలియా పేసర్ మేగాన్ షుట్ (151 వికెట్లు) పేరిట ఉన్న రికార్డును దీప్తి బద్దలు కొట్టింది. ఈ ఫార్మాట్‌లో అత్యధిక వికెట్లు తీసిన మొదటి ముగ్గురు ఆటగాళ్ల జాబితాలో దీప్తి (152) మొదటి స్థానంలో ఉండగా, మేగాన్ షుట్ (151) రెండో స్థానంలో, పాకిస్థాన్‌కు చెందిన నిదా దార్ (144) మూడో స్థానంలో ఉన్నారు.
అన్ని ఫార్మాట్‌లలో మేటి..
దీప్తి శర్మ టీ20ల్లోనే కాకుండా.. టెస్ట్, వన్డేల్లోనూ అద్భుతమైన రికార్డులు నెలకొల్పింది. వన్డేల్లో 162 వికెట్లు, టెస్టుల్లో 20 వికెట్లు తీసుకుంది. ఈ ఏడాది జరిగిన మహిళల వన్డే ప్రపంచ కప్ 2025లో ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’గా నిలిచిన విషయం తెలిసిందే. తాజాగా టీ20ల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానానికి చేరుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే..
శ్రీలంక మహిళల క్రికెట్ జట్టుతో టీమిండియా ఐదు టీ20ల సిరీస్‌లో తలపడిన విషయం తెలిసిందే. అన్నింట్లోనూ గెలిచి 5-0తో శ్రీలంకను భారత్ క్లీన్ స్వీప్ చేసింది. మన అమ్మాయిలు ఆది నుంచి ఆధిపత్యం ప్రదర్శిస్తూ వచ్చింది. ఫలితం.. అన్ని మ్యాచుల్లోనూ విజయం. వన్డే ప్రపంచ కప్ 2025 నుంచి అజేయంగా నిలుస్తూ వస్తున్న టీమిండియా.. శ్రీలంకతో సిరీస్‌ను దక్కించుకుంది.
ఇవీ చదవండి:
Don Bradman Auction: వేలానికి బ్రాడ్‌మన్ 'బ్యాగీ గ్రీన్' క్యాప్..
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!