Home » Deepti Sharma
డబ్ల్యూపీఎల్ మెగా వేలం కొనసాగుతోంది. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను కొనుగోలు చేయడంలో పెద్ద హైడ్రామానే నడిచింది. దీప్తి కోసం ఢిల్లీ, యూపీ పోటీ పడగా.. ఆర్‌టీఎం కార్డ్ ద్వారా యూపీ రూ.3.20కోట్లకు సొంతం చేసుకుంది.
ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్-2025లో విజేతగా నిలిచిన భారత జట్టు బుధవారం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పట్ల భారత స్టార్ క్రికెటర్ దీప్తి శర్మ అభిమానం చాటుకుంది.
యూపీ వారియర్జ్ ఫ్రాంచైజీ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల ప్రీమియర్ లీగ్-2026 మెగా వేలానికి ముందు ఒక్క ప్లేయర్‌నే మాత్రమే రిటైన్ చేసుకుంది. అన్‌క్యాప్డ్ ఇండియన్ బ్యాటరైన శ్వేతా సెహ్రావత్ ను యూపీ రిటైన్ చేసుకుంది. యూపీ జట్టు కెప్టెన్, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ దీప్తి శర్మను సైతం సదరు యాజమాన్యం జట్టు నుంచి రిలీజ్ చేసింది.
క్రికెట్‌లో కొన్ని షాట్లను కొంతమంది మాత్రమే ఆడగలరు. ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్.. ఇటీవల కాలంలో ధోని, కోహ్లీ, రోహిత్ శర్మల గురించి అందరికీ తెలుసు.. ఈ ముగ్గురిది ఎవరి స్టైల్ వారిదే. కానీ ప్రస్తుతం భారత మహిళా క్రికెటర్ దీప్తిశర్మ వార్తల్లో నిలిచింది
Deepti Sharma: టీమిండియా మహిళా క్రికెటర్, ఆల్‌రౌండర్ దీప్తి శర్మ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రావంటి దిగ్గజాలకు సాధ్యంకాని రికార్డును తన పేరిట లిఖించుకుని చరిత్ర సృష్టించింది. టీ20ల్లో 1,000 పరుగులు పూర్తి చేసుకోవడంతో పాటు వంద వికెట్లు తీసిన తొలి భారత క్రికెటర్‌గా దీప్తి రికార్డు సాధించింది.
IND-W vs ENG-W: ఉమెన్స్ టెస్ట్ క్రికెట్ చరిత్రలో మన అమ్మాయిలు చరిత్ర సృష్టించారు. టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే పరుగుల పరంగా భారత అమ్మాయిలు అతిపెద్ద విజయాన్ని నమోదు చేశారు. ఇంగ్లండ్ ఉమెన్స్ జట్టుతో జరిగిన ఏకైక టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఉమెన్స్ జట్టు 347 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది.
స్పిన్ ద్వయం దీప్తిశర్మ(3/12), షఫాలీ వర్మ(3/15) అద్భుత బౌలింగ్‌తో లో స్కోరింగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ ఉమెన్స్ జట్టుపై టీమిండియా ఉమెన్స్ జట్టు జయకేతనం ఎగురవేసింది. ముఖ్యంగా చివరి ఓవర్‌ను అద్భుతంగా బౌలింగ్ చేసిన షఫాలీ వర్మ రెండో టీ20 మ్యాచ్‌లో భారత్‌కు 8 పరుగుల తేడాతో అనూహ్య విజయాన్ని అందించింది.