Share News

Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!

ABN , Publish Date - Dec 30 , 2025 | 04:25 PM

ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితా వెలువడింది. ఇందులో టీమిండియా మహిళా క్రికెటర్లు అదరగొట్టారు. ఎవ్వరికీ ఒక్క డీమెరిట్ పాయింట్ రాకపోవడం విశేషం. మరోవైపు యువ బ్యాటర్ షెఫాలీ మరో 75 పరుగులు చేస్తే ప్రపంచ రికార్డు నెలకొల్పుతుంది.

Team India: ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్.. మన అమ్మాయిలు అదుర్స్ అంతే!
Team India

ఇంటర్నెట్ డెస్క్: ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ 2025 విజేతగా టీమిండియా నిలిచిన విషయం తెలిసిందే. ఆ మెగా టోర్నీ తర్వాత భారత్.. ప్రస్తుతం శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ ఆడుతుంది. నేడు ఆఖరి మ్యాచ్ ఆడనుంది. ప్రపంచ కప్ నాటి నుంచి నేటి వరకు టీమిండియా అమ్మాయిలందరూ అదరగొడుతున్నారు. జట్టులోని ప్రతి ఒక్కరు ఏ మాత్రం తీసిపోకుండా ప్రదర్శనలు ఇస్తున్నారు. తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ జాబితాను వెల్లడించింది. ఇందులో ఎవరూ డీమెరిట్ పొందకపోవడం విశేషం.


ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో షెఫాలీ వర్మ నాలుగు స్థానాలు మెరుగై ఆరో ర్యాంకుకు చేరుకుంది. స్మృతి మంధాన మూడో స్థానంలో కొనసాగుతుంది. రిచా ఘోష్ ఏడు స్థానాలు ఎగబాకి 20వ ర్యాంక్‌లో నిలిచింది. బౌలర్ల విభాగంలో బౌలర్ల విభాగంలో రేణుకా సింగ్, శ్రీచరణి తమ ర్యాంక్‌లను మెరుగుపర్చుకున్నారు. లంకతో మూడో టీ20లో నాలుగు వికెట్లు తీసిన రేణుకా సింగ్.. ఎనిమిది స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకుంది. శ్రీలంకతో నాలుగు మ్యాచ్‌ల్లో నాలుగు వికెట్లు తీసిన శ్రీ చరణి ఏకంగా 17 స్థానాలు జంప్ చేసి ఓవరాల్‌గా 52వ స్థానంలో నిలిచింది.


ప్రపంచ రికార్డుకు అడుగు దూరంలో..

భారత యువ బ్యాటర్ క్రికెటర్ షెఫాలి వర్మ (Shafali Verma) ప్రస్తుతం సూపర్ ఫామ్‌లో ఉంది. శ్రీలంకతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు హాఫ్‌ సెంచరీలు చేసింది. మంగళవారం తిరువనంతపురంలో లంకతో జరిగే ఐదో టీ20లోనూ షెఫాలి ఇదే జోరు కొనసాగిస్తే ప్రపంచ రికార్డు సృష్టిస్తుంది. ఈ యువ బ్యాటర్ మరో 75 పరుగులు చేస్తే మహిళల అంతర్జాతీయ టీ20 సిరీస్‌లో ఎక్కువ రన్స్ చేసిన ప్లేయర్‌గా నిలవనుంది. లంకతో సిరీస్‌లో షెఫాలి ఇప్పటివరకు 236 పరుగులు చేసింది. తొలి మ్యాచ్‌లో కేవలం తొమ్మిది పరుగులకే ఔటైన ఆమె.. తర్వాత వరుసగా మూడు మ్యాచ్‌ల్లో అర్ధ శతకాలతో (69*, 79*, 79*) చెలరేగింది. ఓవరాల్‌గా టీ20 సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు వెస్టిండీస్ దిగ్గజం హేలీ మాథ్యూస్ (310) పేరిట ఉంది. శ్రీలంకతో ఐదు టీ20ల సిరీస్ విషయానికొస్తే.. ఇప్పటివరకు జరిగిన మ్యాచ్‌ల్లోనూ భారత జట్టే విజయం సాధించింది. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్‌స్వీప్ చేయాలని హర్మన్‌ప్రీత్ సేన.. పట్టుదలతో ఉంది.


ఇవీ చదవండి:

అరుదైన రికార్డుకు అడుగు దూరంలో.. స్మృతి మంధాన చరిత్ర సృష్టిస్తుందా?

హార్దిక్ టెస్టులు ఆడతానంటే.. బీసీసీఐ అడ్డు పడుతుందా?: రాబిన్ ఉతప్ప

Updated Date - Dec 30 , 2025 | 04:26 PM