Harmanpreet Kaur : మిథాలీ రాజ్ రికార్డును సమం చేసిన హర్మన్ ప్రీత్ కౌర్
ABN , Publish Date - Dec 31 , 2025 | 11:55 AM
టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్.. మాజీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ ఇప్పటి వరకు టీ20 కెరీర్‌లో 12 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు తీసుకుంది. మంగళవారం నాటి ఇన్నింగ్స్‌తో హర్మన్ కూడా 12 సార్లు ఈ అవార్డు అందుకుంది.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళల జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఓ కీలక రికార్డును సమం చేసింది. శ్రీలంకతో జరిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా ఆఖరి మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జరగింది. ఈ మ్యాచులో కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(68) అద్భుతంగా రాణించింది. ఇతర బ్యాటర్లు ఎవరూ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయారు. హర్మన్ మాత్రం ఒంటరిగా నిలబడి హాఫ్ సెంచరీ సాధించింది. దీంతో ఆమెకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ నేపథ్యంలో టీమిండియా మహిళల మాజీ స్టార్ బ్యాటర్ మిథాలీ రాజ్ రికార్డును సమం చేసింది. మిథాలీ కూడా ఇప్పటి వరకు టీ20 కెరీర్‌లో 12 ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు తీసుకుంది. మంగళవారం నాటి ఇన్నింగ్స్‌తో హర్మన్(Harmanpreet Kaur ) కూడా 12 సార్లు ఈ అవార్డు అందుకుంది.
మ్యాచ్ విషయానికొస్తే..
టాస్ ఓడి బ్యాటింగ్‌కి దిగిన టీమిండియా బ్యాటర్లు కాస్త తడబడ్డారు. శ్రీలంక బౌలర్ల ధాటికి పెవిలియన్‌కి క్యూ కట్టారు. కెప్టెన్ హర్మన్ మాత్రం ఒంటరి పోరాటం చేసింది. దీంతో నిర్ణీత 20 ఓవర్లకు టీమిండియా 7 వికెట్లు కోల్పోి 175 పరుగులు చేసింది. ఛేదనకు దిగిన శ్రీలంక కూడా భారత బౌలర్ల ధాటికి కుప్పకూలింది. 7 వికెట్లు కోల్పోయి 160 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో ఈ మ్యాచ్‌లో టీమిండియా 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. హర్మన్ ప్రీత్ కౌర్ ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌గా నిలిచింది. ఈ సిరీస్‌ను టీమ్‌ఇండియా 5-0 తేడాతో కైవసం చేసుకుంది. శ్రీలంకను క్లీన్ స్వీప్ చేసి చరిత్ర సృష్టించింది.
మిథాలీ కెరీర్‌లో..
మిథాలీరాజ్(Mithali Raj) 1999 నుంచి 2022 వరకు సుదీర్ఘంగా 23 సంవత్సరాల వరకు టీమిండియాకు ప్రాతినిధ్యం వహించింది. ఆమె తన కెరీర్లో 89 టీ20 మ్యాచ్‌లు ఆడింది. 12 ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు సొంతం చేసుకుంది. హర్మన్ ప్రీత్ కౌర్ 187 టీ 20 మ్యాచుల్లో 12 ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్‌లు సాధించింది. దీంతో మిథాలీ రికార్డ్‌ను హర్మన్ ప్రీత్ సమం చేసింది. మిథాలీ ఈ ఫార్మాట్లో 2,364 పరుగులు చేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ ఇప్పటివరకు 3,784 రన్స్ రాబట్టింది.
ఇవీ చదవండి:
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్.. జట్టులోకి షమీ రీఎంట్రీ..!
దీప్తి శర్మ ప్రపంచ రికార్డు.. తొలి బౌలర్‌గా!