19 మంది అగ్నిమాపక సిబ్బందికి పురస్కారాలు
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:43 AM
తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కారాలు వరించాయి.
హైదరాబాద్, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర అగ్నిమాపక శాఖలో ఉత్తమ సేవలు అందించిన అధికారులు, సిబ్బందికి నూతన సంవత్సరం పురస్కారాలు వరించాయి. విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 19 మందికి సేవా పథకాలను ప్రకటిస్తున్నట్లు హోం శాఖ ముఖ్య కార్యదర్శి సీవీ ఆనంద్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. చంద్రాయణగుట్ట ఫైర్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఫైర్ ఆఫీసర్ కె. భిక్షపతి, లీడింగ్ ఫైర్ ఫైటర్ మహమ్మద్ షబ్బీర్‌లకు ప్రతిష్ఠాత్మక శౌర్యపతకాలు లభించాయి. ఆర్. సుధాకర్ (జిల్లా అగ్నిమాపక అధికారి), కేవీ సతీష్ కుమార్(సహాయ అగ్నిమాపక అధికారి), సి. శ్రీశైలం(ఫైర్ ఫైటర్ టెక్నికల్)లకు ఉత్తమ సేవా పతకాలు దక్కాయి. ఆయా విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న మరో 14 మందికి సేవా పతకాలు లభించాయి.