Hyderabad: నేటి నుంచే నుమాయిష్..
ABN , Publish Date - Jan 01 , 2026 | 09:15 AM
హైదరాబాద్‌లో ప్రతి సంవత్సరం జరిగే నుమాయిష్.. గురువారం నుంచి ప్రారంభం కానుంది. దాదాపు నెలా పదిహేను రోజులతపాటు దీనిని నిర్వహిస్తారు. కాగా.. ప్రవేశ రుసుం రూ. 50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు.
- ప్రారంభించనున్న మంత్రులు భట్టి, కోమటిరెడ్డి
- సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు..
- సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు
- ప్రవేశ రుసుం రూ. 50.. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచితం
హైదరాబాద్: అఖిల భారత పారిశ్రామిక ప్రదర్శన (నుమాయిష్) గురువారం ప్రారంభం కానుంది. దీనిని ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఫిబ్రవరి 15 వరకు సుమారు 45 రోజులపాటు కొనసాగనుంది. ప్రవేశ రుసుం రూ. 50గా నిర్ణయించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రవేశం కల్పించనున్నారు. ప్రతీరోజూ సాయంత్రం 4 నుంచి రాత్రి 10 గంటల వరకు, శని, ఆదివారం, సెలవు దినాల్లో రాత్రి 11 గంటల వరకు కొనసాగుతుంది.
నగర శివారు ప్రాంతాల నుంచి నుమాయిస్ కు వచ్చే వారికోసం ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడపనుంది. మెట్రో రైళ్ల సమయాన్ని పొడిగించారు. భద్రతపై సొసైటీ పాలకవర్గం దృష్టి సారించింది. అజంతాగేట్, గాంధీభవన్, మాలకుంట రోడ్, ప్రవేశ ద్వారాల వద్ద మెటల్ డిటెక్టర్లను ఏర్పాటు చేశారు. తనిఖీ చేసిన తర్వాతే సందర్శకులను లోపలికి అనుమతించనున్నారు. వయోవృద్ధుల కోసం వలంటీర్లతో వీల్‌చైర్లను ఏర్పాటు చేశారు.

ఉచిత పార్కింగ్
ఎగ్జిబిషన్‌కు వచ్చే సందర్శకుల కోసం నాంపల్లి గృహకల్ప, చంద్రవిహార్, గగన్‌విహార్, భీంరావువాడ తదితర ప్రాంతాల్లో వాహనాలను పార్కింగ్ చేసేందుకు అధికారులు ఏర్పాటు చేశారు. ఆయా స్థలాల్లో వాహనాలను ఉచితంగా పార్కింగ్ చేయవచ్చు.
అమ్యూజ్‌మెంట్ పార్క్
అమ్యూజ్‌మెంట్ పార్క్‌లో రకరకాల రైడింగ్‌లను, జెయింట్ వీల్, డ్రాగన్ తదితర ఆటవస్తువులను ఏర్పాటు చేశారు.
చుక్‌చుక్ రైలు
నుమాయిష్ సందర్శనకు వచ్చిన వారు రైలు ఎక్కి ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం చుట్టి వస్తారు. గతంలో రైలు పట్టాలపై నడిచేది. ప్రస్తుతం ట్రాక్టర్ టైర్లతో రైలును ఎగ్జిబిషన్ పాలకవర్గం నడుపుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. 'కల్కి-2' షూటింగ్‌కు డార్లింగ్!
రానూపోనూ టికెట్లు బుక్ చేస్తే 10శాతం రాయితీ
Read Latest Telangana News and National News