Share News

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్

ABN , Publish Date - Jan 25 , 2026 | 06:36 PM

మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి పేర్ని నాని అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

మా జోలికి వస్తే ఊరుకోం.. పేర్నినాని, జోగి రమేశ్‌కు కొల్లు రవీంద్ర స్ట్రాంగ్ వార్నింగ్
Minister Kollu Ravindra

కృష్ణాజిల్లా, జనవరి 25: మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేశ్‌పై ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (Minister Kollu Ravindra) సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజకీయ స్వలాభం కోసం గోడలు దూకే వ్యక్తి పేర్ని నాని అని విమర్శించారు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టే వ్యక్తి ఆయనే అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబు స్థాయికి సరిపోని వ్యక్తి పేర్ని నాని అని ఎద్దేవా చేశారు. బందరు పోర్టును అమ్మేసిన వ్యక్తి కూడా ఆయనేనని విమర్శలు చేశారు. స్ట్రీట్ ఫీల్డ్ పేరుతో దొంగ పట్టాలు ఇచ్చి రెవెన్యూ అధికారులు రోడ్డున పడటానికి కారణం పేర్ని నాని కాదా..? అని ప్రశ్నల వర్షం కురిపించారు.


బందరు పోర్టు పేరుతో రాజకీయ డ్రామాలు..

కట్టుకున్న భార్యనే తన అనినీతి వ్యాపారంతో రోడ్డున పడేసిన వ్యక్తి పేర్ని నాని అని ధ్వజమెత్తారు. ఆయన చేసిన ప్రతి పాపం కౌంట్ అయిందని.. అందుకే వైసీపీ 151 నుంచి 11 సీట్లకు పరిమితమైందనే విషయాన్ని ఆయన మరవద్దని హితవు పలికారు. రాష్ట్రం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబును విమర్శించే అర్హత పేర్ని నానికి లేదని విమర్శించారు. నాడు బందరు పోర్టు పేరుతో రాజకీయ డ్రామాలు ఆడిన వ్యక్తి ఆయన కాదా...? అని నిలదీశారు. రాజకీయ సన్యాసం చేస్తానని చెప్పి సిగ్గు లేకుండా రాజకీయాలు చేస్తున్న వ్యక్తి పేర్ని నానినేనని ఎద్దేవా చేశారు. 2024 ఎన్నికల్లో డిపాజిట్లు కూడా రావని తెలిసి పారిపోయిన వ్యక్తి కూడా ఆయనేనని దెప్పిపొడిచారు. పేర్ని నానీని ప్రజలు ఛీకొడుతున్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రి కొల్లు రవీంద్ర హితవు పలికారు.


జోగి రమేశ్‌‌పై మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం

మాజీ మంత్రి జోగి రమేశ్‌పై మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దమ్ముంటే సీఎం చంద్రబాబు ఇంటిపైకి రా... తమ తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. దొంగ సారా అమ్మి తప్పు చేశాననే భయం జోగి రమేశ్‌లో ఇసుమంత కూడా లేదని ఎద్దేవా చేశారు. బెయిల్‌పై విడుదలై నానా యాగీ చేస్తావా..!? అని ధ్వజమెత్తారు. అనుమతులు లేకుండా ర్యాలీలు చేస్తామని ఓ సీనియర్ పోలీస్ అధికారిని వేలు పెట్టి బెదిరిస్తావా..? అని ఆగ్రహించారు. ఆయన చేసింది మహా పాపమని విమర్శించారు. ప్రజలు కోరుకున్న మంచి ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే తాము చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయ్యాననే భయం కూడా లేకుండా అరాచకాలకు జోగి రమేశ్‌ పాల్పడుతున్నాడని మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి...

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 25 , 2026 | 07:12 PM