బడ్జెట్ సమావేశాలపై ఎంపీలకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం
ABN , Publish Date - Jan 25 , 2026 | 05:05 PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
అమరావతి, జనవరి25 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం ఆదివారం ఉండవల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ ఎంపీలకు చంద్రబాబు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు చంద్రబాబు మార్గనిర్దేశం చేశారు. అమరావతికి నిధులు, పోలవరానికి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించిన అంశాల గురించి ఈ సమావేశంలో చర్చించారు.
ఇప్పటికే అమరావతికి రూ.15 వేల కోట్ల నిధులను కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిందని సీఎం ప్రస్తావించారు. రెండో విడతలో కూడా ఇదే తరహా సాయం కోరుతున్నామని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టును 2027 కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ఆ దిశగా కేంద్రం కూడా సహకరించాలని కోరుతామని పేర్కొన్నారు. విశాఖ రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు నిధులు, జాతీయ రహదారులకు నిధులు తదితర అంశాలపై ఎంపీలతో సీఎం చర్చించారు. బడ్జెట్‌లో ఏపీకి అత్యధిక నిధులు కేటాయించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి
తిరుపతిలో దళిత యువతిపై అత్యాచారం
Read Latest AP News And Telugu News