తిరుపతిలో దళిత యువతిపై అత్యాచారం
ABN , Publish Date - Jan 25 , 2026 | 04:07 PM
తిరుపతిలో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా పెంచుకున్న పరిచయం ఓ యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది.
తిరుపతి, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): తిరుపతిలో దారుణ ఘటన (Tirupati incident) వెలుగులోకి వచ్చింది. సామాజిక మాధ్యమాల ద్వారా పెంచుకున్న పరిచయం ఓ యువతి జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసింది. కడపకు చెందిన ఓ యువకుడు.. 19 ఏళ్ల దళిత యువతిని నమ్మించి హోటల్ గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా కలకలం సృష్టిస్తోంది.
ఏమైందంటే..
అలిపిరి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తిరుపతి రూరల్ మండలానికి చెందిన బాధిత యువతికి కడపకు చెందిన ఓ యువకుడితో ఇన్‌స్టాగ్రామ్ (Instagram) ద్వారా పరిచయం ఏర్పడింది. ఆ పరిచయాన్ని ఆసరాగా చేసుకున్న నిందితుడు.. ఆమెకు మాయమాటలు చెప్పి నమ్మించాడు. అలిపిరి పోలీస్ స్టేషన్ పరిధి రామచంద్ర నగర్‌లో గల టౌన్‌హౌస్ (Town House)కు తీసుకెళ్లాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెను బలవంతంగా హోటల్ గదికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం అక్కడి నుంచి పారిపోయి వచ్చిన బాధితురాలు తన తల్లితో కలిసి ధైర్యంగా అలిపిరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు వెంటనే స్పందించారు.
పోలీసుల చర్యలు..
అలిపిరి పోలీసులు, క్లూస్ టీమ్ సభ్యులు వెంటనే టౌన్ హౌస్ హోటల్‌లోని రూమ్ నెంబర్ 114కు చేరుకుని ఆధారాలను సేకరించారు. అలిపిరి సీఐ రామ్ కిషోర్ పర్యవేక్షణలో ఎస్సై శ్రీవాణి ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై 44/2026 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సోషల్ మీడియా పట్ల అప్రమత్తత..
ఈ ఘటన సోషల్ మీడియాలో అపరిచితులతో పరిచయాలు ఎంత ప్రమాదకరమో మరోసారి నిరూపించింది. ముఖ్యంగా యువతులు ఇలాంటి కేటుగాళ్ల మాయమాటలు నమ్మి.. వారి ఉచ్చులో పడకుండా జాగ్రత్త వహించాలని పోలీసులు సూచించారు. మరోవైపు మహిళలపై జరుగుతున్న ఇలాంటి అకృత్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. నిందితుడిని కఠినంగా శిక్షించాలని బాధితురాలి కుటుంబ సభ్యులు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి...
అమరావతిని ఫైనాన్స్ హబ్‌గా మారుస్తాం: సీఎం చంద్రబాబు
ట్రెండింగ్‌లో హ్యాపీ బర్త్‌డే మన లోకేశ్
Read Latest AP News And Telugu News