Home » CM Ramesh
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ముందుచూపుతో మొంథా తుఫాను నుంచి చాలా తక్కువ నష్టంతో బయటపడ్డామని ఎంపీ సీఎం రమేష్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, కుటుంబ సభ్యులతో కలిసి ఆయన గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు.
డబుల్ ఇంజిన్ సర్కారుతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంటే.. అడ్డుకోవాలని జగన్ అండ్ కో చూస్తున్నారని అనకాపల్లి ఎంపీ రమేశ్ ధ్వజమెత్తారు. ఏపీకి పరిశ్రమలు రాకుండా పారిశ్రామికవేత్తలకు మెయిల్ పంపించి జగన్ అండ్ కో బెదిరిస్తున్నారని ఎంపీ రమేశ్ ఆరోపించారు
తమ నాయకుడు కేటీఆర్‌పై వ్యాఖ్యలు చేస్తే వాటిని ఖండిస్తూ మాట్లాడానని... తనపై కుట్ర పూరీతంగా కేసు నమోదు చేశారని.. తాను అనని వాఖ్యలను చిత్రీకరించారని గాదరి కిశోర్ అన్నారు.
మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.
రాబోయే ఎన్నికల్లో బీజేపీ, టీడీపీ కలసి పోటీ చేస్తాయనే భయాందోళనలతో మాజీ మంత్రి కేటీఆర్ ఉన్నారని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ విమర్శించారు. తెలంగాణలో బీజేపీ, టీడీపీ కలిసి పోటీ చేస్తే కేటీఆర్‌కి ఏంటి బాధ అని ప్రశ్నించారు. తెలంగాణలో సీఎం రేవంత్‌రెడ్డికి మద్దతుగా ఉన్నారని రెడ్లను, ఏపీలో చంద్రబాబుకు మద్దతుగా ఉన్నారని కమ్మ కులస్తులను కేటీఆర్ విమర్శించిన మాట నిజం కాదా అని ఎంపీ రమేష్ ప్రశ్నించారు.
BJP MP CM Ramesh: జగన్ అండ్ కో దోచుకున్న ప్రజల సొమ్మును కక్కిస్తామని బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ హెచ్చరించారు. చాలామందిని భయపెట్టి డిస్టిలరీలను జగన్ సొంతం చేసుకున్నారని.. ఆయన బెదిరింపులకు పాల్పడి నాసిరకం మద్యం అమ్మారని ఎంపీ సీఎం రమేశ్ ఆరోపించారు.
AP BJP MLAs: ఏపీ బీజేపీ శాసన సభా పక్ష సమావేశం విజయవాడలోని ఎమ్మెల్యే సుజనా చౌదరి నివాసంలో జరిగింది. ఆ సమావేశానికి బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతోపాటు ఆ పార్టీ సీనియర్లు సైతం హాజరయ్యారు.
జమ్మలమడుగులోని ఓ క్లబ్‌లో పగలు రాత్రి తేడా లేకుండా అనధికారికంగా పేకాట నిర్వహిస్తున్నట్లు ప్రజల నుంచి విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఈ క్రమంలోనే అనకాపల్లి ఎంపీ, బీజేపీ నేత సీఎం రమేష్ నాయుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు క్లబ్ మూసివేశారు.
Republic Club: జమ్మలమడుగులోని రిపబ్లిక్ క్లబ్‌ను పోలీసులు మూ సి వేశారు. ఎంపీ ఫిర్యాదుతోపాటు మీడిాయాలో వరుస కథనాలు నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు. అదీకాక.. ఉదయం 10.00 గంటల నుంచి రాత్రి 11.00 గంటల వరకు నిర్విరామంగా సదరు క్లబ్‌లో పేకాట నిర్వహిస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కేంద్ర మంత్రులు కుమారస్వామి, భూపతిరాజు శ్రీనివాస వర్మ స్టీల్ ప్లాంట్‌ను సందర్శించారు. అనంతరం ఉక్కు హౌస్‌లో కార్మిక సంఘాల నేతలతో సుమారు గంటపాటు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సీఎం రమేష్ కీలక వ్యాఖ్యలు చేశారు.