Share News

CM Ramesh complaint: మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై సీఎం రమేష్ ఫిర్యాదు..

ABN , Publish Date - Sep 20 , 2025 | 10:56 AM

మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే.

CM Ramesh complaint: మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై సీఎం రమేష్ ఫిర్యాదు..
CM Ramesh vs Gadari Kishore

మాజీ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌పై అనకాపల్లి ఎంపీ సీఎమ్ రమేష్ జూబ్లీహిల్స్ పీఎస్ లో ఫిర్యాదు చేశారు. ఇటీవల సీఎం రమేష్, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై పలు ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ వ్యాఖ్యలను ఖండిస్తూ గాదరి కిశోర్ (Gadari Kishore news) తనపై దూషణలకు దిగారని సీఎమ్ రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో సీఎం రమేష్ ఫిర్యాదు చేశారు.

జూబ్లీహిల్స్ పోలీసులు గాదరి కిశోర్‌కు నోటీసులు అందచేశారు. విచారణకు రావాల్సిందిగా ఆదేశించారు (CM Ramesh complaint). శనివారం ఉదయం పది గంటలకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో గాదరి కిశోర్ విచారణకు హాజరయ్యారు. 351(1), 353(1)(C), 353(2) r/w 49 BNS ప్రకారం పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవి కూడా చదవండి

మళ్లీ పెరిగిన బంగారం ధర.. ఈ రోజు బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.

ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ముగిసిన సిట్ సోదాలు.. కీలక డాక్యుమెంట్లు స్వాధీనం

Read Latest Telangana News And Telugu News

Updated Date - Sep 20 , 2025 | 01:38 PM