Share News

ఐ అండ్ పీఆర్ శాఖపై సీఎం ఆగ్రహం

ABN , Publish Date - May 07 , 2026 | 12:34 PM

ఐ అండ్ పీఆర్ శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖ కేవలం ప్రభుత్వానికి ఓ ఆభరణంలా తయారైందని సీరియస్ అయ్యారు.

ఐ అండ్ పీఆర్ శాఖపై సీఎం ఆగ్రహం
AP CM Chandrababu Naidu

అమరావతి, మే 7 (ఆంధ్రజ్యోతి): సమాచార పౌర సంబంధాల శాఖపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వద్ద ఐ అండ్ పీఆర్ వ్యవస్థ సరిగా పనిచేయకుండా కేవలం ఓ ఆభరణంలా తయారైందని సీరియస్ అయ్యారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్లను ఎందుకు ఉపయోగించుకోవడం లేదని ప్రశ్నించారు. స్థానికంగా ఉండే ఇన్‌ఫ్లూయెన్సర్ల సాయంతో చేస్తున్న మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లేలా చూడాలని దిశానిర్దేశం చేశారు.


అభివృద్ధిని అడ్డుకునేలా అధికారుల తీరు ఉండొద్దు..

కొందరు అధికారుల పనితీరు అభివృద్ధిని అడ్డుకునేలా ఉండటం సరికాదని సీఎం చంద్రబాబు హితబోధ చేశారు. పోడు వ్యవసాయాన్ని అడ్డుకుంటామంటే అరకులో కాఫీ పంట ఉంటుందా..? అని నిలదీశారు. అధికారులు మారి అభివృద్ధికి ఊతం ఇవ్వాలని హితవు పలికారు. కొందరు అధికారుల సర్వీసులను ఎందుకు అమల్లోకి తీసుకోవడం లేదని నిలదీశారు. ఇది డబల్ ఎడ్జి వెపన్ అటు ఇటు వాడుతారని.. అలాంటప్పుడు వాటిని సరిగా ఎందుకు కౌంటర్ చేయట్లేదని ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో 7వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఈరోజు (గురువారం) సచివాలయంలో జరుగుతోంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై అధికారులతో ముఖ్యమంత్రి చర్చించారు.


కలెక్టర్‌ల మధ్య, జిల్లాకు జిల్లాకు మధ్య పోటీ ఉండాలని సీఎం సూచించారు. ఇన్నోవేటివ్ ఐడియాలు తీసుకువస్తే అధికారులను మెంటర్‌గా నియమిస్తామని చెప్పుకొచ్చారు. ఎంతవేగంగా పనులు చేస్తే అంతేవేగంగా ఫలితాలు వస్తాయని సూచించారు. ప్రతి ఫైలులోని సమస్యలను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. కలెక్టర్లు రిజల్ట్ ఓరియెంటేషన్‌తో పనిచేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి

జగన్ అండ్ కో క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారు.. పల్లా శ్రీనివాసరావు ధ్వజం

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 07 , 2026 | 01:39 PM