రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ: మంత్రి డీబీవీ స్వామి
ABN , Publish Date - May 06 , 2026 | 12:08 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు.
ప్రకాశం, మే 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan Mohan Reddy) ఆంధ్రప్రదేశ్ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి (Minister Dola Sri Bala Veeranjaneyaswamy) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విలువలు లేని పార్టీ వైసీపీ అని ఎద్దేవా చేశారు. ఈరోజు (బుధవారం) ఒంగోలులో టీడీపీ పార్లమెంట్ నూతన భవనానికి భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి డీబీవీ స్వామి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, ఉమ్మడి జిల్లా టీడీపీ ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి డీబీవీ స్వామి మాట్లాడారు.
దివంగత మాజీ సీఎం నందమూరి తారక రామారావు వేసిన పునాదులతో 44 ఏళ్ల నుంచి టీడీపీ జెండా రెపరెపలాడుతోందని మంత్రి ఉద్ఘాటించారు. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ చంద్రబాబు, లోకేశ్ పార్టీని మరింత బలోపేతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజాసంక్షేమం, సామాజిక న్యాయం కోసం టీడీపీ పనిచేస్తోందని పేర్కొన్నారు. టీడీపీ ఆవిర్భావంతోనే సమాజంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయని చెప్పుకొచ్చారు. వెలిగొండ పూర్తి కాకుండానే జాతికి అంకితం చేసి జగన్ ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. జగన్ చేసిన మోసాన్ని వైసీపీ నేతలే స్వయంగా ఒప్పుకున్నారని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
పెట్టుబడుల హబ్‌గా ఏపీ.. మంత్రి నారా లోకేశ్ కృషితో మరో భారీ పరిశ్రమ
జగన్ హయాంలో గుంటూరు ఛానల్ పనులను పట్టించుకోలేదు.. పెమ్మసాని ధ్వజం
హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత
Read Latest AP News And Telangana News And International News And Telugu News