Share News

హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత

ABN , Publish Date - May 05 , 2026 | 11:19 AM

రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు.

హెల్మెట్ ధరిద్దాం.. ప్రాణాలు కాపాడుకుందాం: అనిత
Home Minister Anitha

అనకాపల్లి జిల్లా, మే5 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాలతో చాలా కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత (Home Minister Anitha) వ్యాఖ్యానించారు. రోడ్డు ప్రమాదాలపై ముందు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించేలాగా అవగాహన కల్పిస్తున్నామని చెప్పుకొచ్చారు. హెల్మెట్ ధరిద్దామని... ప్రాణాలు కాపాడుకుందాం అంటూ నినదించారు. ఈరోజు (మంగళవారం) పాయకరావుపేట నియోజకవర్గంలో హోంమంత్రి అనిత పర్యటించారు.. రోడ్డు ప్రమాదాల నివారణపై అడ్డరోడ్డు నుంచి నక్కపల్లి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో అనిత పాల్గొన్నారు. సురక్షిత రోడ్లు.. సురక్షిత జీవితం అంటూ హెల్మెట్లతో ర్యాలీ తీశారు.


హెల్మెట్ ధరిద్ధం- సురక్షితంగా పయనిద్దాం అంటూ అనిత నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వాహనదారులకు హెల్మెట్లు పంపిణీ చేశారు. అనంతరం అనిత మాట్లాడారు. చాలామంది రూ.2 లక్షల విలువ గల బైక్‌ను వాడతారు గాని, హెల్మెట్‌ను మాత్రం ధరించరని చెప్పుకొచ్చారు. ద్విచక్ర వాహనం నడిపే ప్రతి ఒక్కరూ కచ్చితంగా హెల్మెట్‌ను ధరించాలని సూచించారు. ప్రాణం చాలా విలువైనదని... ప్రాణం కన్నా ఏది ఎక్కువ కాదని అన్నారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఒక్క నెల్లోనే చాలా రోడ్డు ప్రమాదాలు జరిగాయని వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు చనిపోవడం చాలా బాధాకరమని... ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. పాయకరావుపేట నియోజకవర్గంలో ఎవరైనా హెల్మెట్ ధరించాల్సిందేనని స్పష్టం చేశారు. నాయకులైన హెల్మెట్ ధరించకుండా రోడ్డుపైకి వస్తే డబల్ ఫైన్ వేయాలని పోలీసులను హోంమంత్రి అనిత ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి...

మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ

మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు

ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం

Read Latest AP News And Telangana News And International News And Telugu New

s

Updated Date - May 05 , 2026 | 11:24 AM