మోదీ దార్శనికతపై ప్రజల విశ్వాసం పెరుగుతోంది: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - May 04 , 2026 | 12:26 PM
ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు.
అమరావతి, మే4 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల నేపథ్యంలో పశ్చిమ బెంగాల్, అస్సాం, పుదుచ్చేరిలో ఎన్డీఏ అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రజలు మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) నాయకత్వానికి మద్దతు తెలుపుతున్నారని సీఎం పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాల ట్రెండ్‌ను పరిశీలిస్తే ఎన్డీఏ అభ్యర్థుల ప్రదర్శన స్పష్టంగా కనిపిస్తోందని చెప్పుకొచ్చారు. ప్రజల్లో మోదీపై విశ్వాసం తగ్గలేదని, మరింతగా పెరిగిందని అభిప్రాయపడ్డారు. దేశ అభివృద్ధి దిశగా కేంద్రప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు ఇస్తున్నారని వ్యాఖ్యానించారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు
‘వికసిత భారత్’ లక్ష్యానికి మద్దతు..
2047 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే ‘వికసిత భారత్’ లక్ష్యానికి ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ దిశగా కేంద్రప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రజల్లో విశ్వాసాన్ని పెంచుతున్నాయని తెలిపారు.
‘సబ్ కా సాథ్’ నినాదం అమలు..
‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ అనే నినాదం కేవలం మాటలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే విధంగా అమలవుతోందని సీఎం కొనియాడారు. అభివృద్ధి ఫలాలు ప్రతివర్గానికీ అందేలా ప్రధాని మోదీ చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈ ఎన్నికల ఫలితాలు ఎన్డీఏ కూటమిని మరింత ఐక్యంగా, బలంగా మారుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ అభివృద్ధి కోసం కేంద్రం, రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత పెరుగుతోందని పేర్కొన్నారు.
ప్రజల ఆకాంక్షల ప్రతిబింబం..
ప్రస్తుత ఫలితాలు మోదీ నాయకత్వంపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వాసానికి నిదర్శనమని, ‘వికసిత భారత్’ దార్శనికతకు ఇది బలమైన మద్దతని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ‘సబ్ కా సాథ్’ స్ఫూర్తితో దూసుకెళ్తున్న ఎన్డీఏ ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ మరింత బలోపేతం అవుతుందని ఉద్ఘాటించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం
విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు
ప్రకాశ్‌రాజ్ ఓ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News