మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి నారాయణ
ABN , Publish Date - May 04 , 2026 | 09:25 AM
తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు.
నెల్లూరు, మే 4 (ఆంధ్రజ్యోతి): తెలుగుదేశం పార్టీ ప్రతి ఏడాది నిర్వహించే మహానాడును ఈ సారి నెల్లూరు జిల్లాలో నిర్వహిస్తున్నామని ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) వ్యాఖ్యానించారు. మహానాడును అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్నామని పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) నెల్లూరు జిల్లాలో మంత్రి నారాయణ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. మహానాడును ఇఫ్కోసెజ్‌లో నిర్వహించాలని నిర్ణయించామని చెప్పుకొచ్చారు.
అక్కడ రెండు వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఆ ప్రాంతాన్ని శుభ్రం చేయిస్తున్నామని.. ఈ నెల 6వ తేదీన పనులు ప్రారంభిస్తామని వెల్లడించారు. రాష్ట్రం, ప్రజల భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలను మహానాడులో తీసుకుంటామని.. ప్రజలకు పలు హామీలు ఇస్తామని అన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాది మంది మహానాడుకు రానున్నారని చెప్పుకొచ్చారు. ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహానాడును.. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తాం: మంత్రి ఆనం
విజయసాయికి అన్ని పార్టీల్లో డోర్లు క్లోజ్ అయ్యాయి.. బుద్దా వెంకన్న సెటైర్లు
ప్రకాశ్‌రాజ్ ఓ పొలిటికల్ జోకర్.. కిరణ్ రాయల్ షాకింగ్ కామెంట్స్
Read Latest AP News And Telangana News And International News And Telugu News