ఐదు రాష్ట్రాల ఫలితాల వేళ ప్రధాని మోదీ ఆసక్తికర పోస్ట్.. నైపుణ్యం, కృషి, కరుణపై సందేశం
ABN , Publish Date - May 04 , 2026 | 09:45 AM
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఢిల్లీ, మే 4 (ఆంధ్రజ్యోతి): ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల లెక్కింపు జరుగుతున్న వేళ ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టు రాజకీయ వర్గాల్లో, సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రధాని మోదీ తన ట్వీట్‌లో నైపుణ్యం, కృషి, కరుణ వంటి విలువల ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. ఇవి జీవితంలో మనుషులకు అద్భుతమైన శక్తులుగా పనిచేస్తాయని మోదీ పేర్కొన్నారు. ప్రతి సవాలును అధిగమించడమే కాకుండా, లక్ష్యాలను సాధించడంలో కూడా ఇవి కీలక పాత్ర పోషిస్తాయని ప్రధాని అభిప్రాయపడ్డారు.
ప్రధాని మోదీ పోస్ట్‌పై ఆసక్తి..
‘నైపుణ్యం, శ్రద్ధ, కరుణ అనేవి మన జీవితంలోని అద్భుతమైన శక్తులు. వాటి ద్వారా మనం ప్రతి సవాలును అధిగమించడమే కాకుండా, అవి మన లక్ష్యాలను సాధించడానికి కూడా సహాయపడతాయి’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. సమర్థునికి భారం ఎవరు?, శ్రద్ధగలవారికి ఏది దూరంగా ఉంటుంది? బాగా చదువుకున్నవారికి ఏది అపరిచితంగా ఉంటుంది? అని మోదీ ప్రశ్నించారు. నైపుణ్యం, కృషి, కరుణ వంటి విలువలపై ప్రధాని మోదీ ఇచ్చిన సందేశం ప్రజల్లో విభిన్న రీతుల్లో చర్చకు దారితీస్తోంది. మోదీ సందేశంపై సోషల్ మీడియాలో విభిన్న స్పందనలు వస్తున్నాయి. కొందరు ఇది ప్రేరణాత్మక సందేశమని స్వాగతించగా, మరికొందరు ఎన్నికల ఫలితాల వేళ ఇలాంటి వ్యాఖ్యలు రాజకీయ సంకేతాలను సూచించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మే 4 నుంచి 9 వరకు రైతు వారోత్సవాలు: మంత్రి తుమ్మల
ఓఆర్‌ఆర్‌పై వాహనదారులకు సీపీ సజ్జనార్ కీలక సూచనలు
ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి
Read Latest Telangana News And AP News And International News And Telugu News