Share News

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి

ABN , Publish Date - May 03 , 2026 | 08:21 AM

ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.

ఢిల్లీలో పేలిన ఏసీ.. తొమ్మిది మంది మృతి
Delhi Fire Accident

ఢిల్లీ, మే3 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ నగరంలోని వివేక్ విహార్ ప్రాంతంలో ఈరోజు (ఆదివారం) అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. వివేక్ విహార్ ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనలకు గురిచేసింది. ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలడం వల్ల ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సమాచారం అందగానే ఘటన స్థలానికి అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఒక్కసారిగా మంటలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వివేక్ విహార్‌లోని ఓ భవనంలోని రెండో అంతస్తులో ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో అమర్చిన ఏసీ ఒక్కసారిగా పేలడంతో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు తీవ్ర రూపం దాల్చి మొత్తం ఇంటిని అలుముకున్నాయి. అక్కడున్న వారు బయటకు రాకముందే మంటలు వేగంగా వ్యాపించాయి.


మంటలు వేగంగా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న తొమ్మిది మంది బయటకు రాలేకపోయారు. అగ్నికి ఆహుతైన వారు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో తొమ్మిది మంది చనిపోవడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను ఆర్పేందుకు శ్రమించారు. 14 ఫైర్ ఇంజిన్లతో సిబ్బంది అక్కడికి చేరుకుని రెండు గంటలపాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అయితే అప్పటికే భారీ నష్టం వాటిల్లింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. అగ్నిప్రమాదానికి గల కచ్చితమైన కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.


Updated Date - May 03 , 2026 | 09:19 AM