Home » Ongole
ఏపీలో గనుల సీనరేజీ పాలసీ సరళీకృతం చేస్తున్నామని.. అన్ని జిల్లాల్లో మైనింగ్ కార్యాలయాలు నిర్మిస్తామని మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. ఇసుక అందుబాటులో లేని ప్రాంతాలకు కూడా సరఫరా చేస్తున్నామని మంత్రి చెప్పారు.
కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యల నేపథ్యంలో మానసికంగా కృంగిపోయిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. బాచుపల్లి పోలీసులు తెలిపిన ప్రకారం.. ప్రకాశం జిల్లా, మార్కాపురానికి చెందిన తోట శ్రావణ్ (32) సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ రాజీవ్‌గాంధీనగర్‌లోని గ్రీన్‌వ్యూ టవర్స్‌లోని పూజితా ఎన్‌క్లేవ్‌లో నివాసముంటున్నాడు.
ఒంగోలులో అర్ధరాత్రి సమయంలో స్వల్పంగా కంపించింది.
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
తెలుగుదేశం ఒంగోలు నేత వీరయ్య చౌదరి హత్య కేసులో ప్రధాన నిందితుడికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్ నిరాకరించింది. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీంకోర్టులో నిందితుడు ముప్పా సురేష్ బాబు పిటిషన్ దాఖలు చేశాడు. సురేష్ బాబు దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ (సోమవారం) జస్టిస్ రాజేష్ బిందాల్, జస్టిస్ మన్మోహన్‌ల ధర్మాసనం విచారణ జరిపింది.
ఉత్తర భారత దేశంలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవడానికి సెప్టెంబర్ 9న భారత గౌరవ్ టూరిస్ట్ రైలు యాత్ర నిర్వహిస్తున్నట్లు ఇండియన్ రైల్వే సౌత్ స్టార్ రైల్ అండ్ టూర్ టైమ్స్ డైరెక్టర్ విగ్నేష్ తెలిపారు. బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో రైలుయాత్ర వాల్‌పోస్టర్‌ను ఆయన ఆవిష్కరించారు.
రాష్ట్రానికి దూరంగా మధ్యప్రదేశ్‌లో అల్పపీడనం కొనసాగుతోంది. అదే సమయంలో..
సమాజ హితం కోసం ‘ఆంధ్రజ్యోతి’ చేసే ప్రతి ఒక్క ఆలోచననూ అమలు చేస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ హామీ ఇచ్చారు.
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఆంధ్రజ్యోతి చేపట్టిన అక్షరమే అండగా పరిష్కారమే అజెండాగా సభ శనివారం ఒంగోలులో జరగనుంది. ఈ ఏడాది జనవరి 28న ఒంగోలులోని 37వ డివిజన్ పరిధిలోని ఎన్టీఆర్ పార్కులో చర్చా వేదిక నిర్వహించారు.
YSRCP: ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లో దాదాపు 200 మంది బాధితులను లక్ష్మీ విజయ్ కుమార్ మోసం చేసినట్లు తెలుస్తోంది. వెయ్యి కోట్లు టర్నోవర్ ఉన్న పెద్ద రియల్ ఎస్టేట్ సంస్థ అంటూ జోరుగా ప్రచారం చేశాడు.