Share News

Ram Gopal Varma: ఒంగోలు‌లో విచారణకు హాజరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ

ABN , Publish Date - Aug 12 , 2025 | 11:55 AM

ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.

Ram Gopal Varma: ఒంగోలు‌లో విచారణకు హాజరైన దర్శకుడు రాంగోపాల్ వర్మ
Director Ram Gopal Varma

ప్రకాశం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ (Director Ram Gopal Varma) హాజరయ్యారు. ఇవాళ (మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు. ఈ మేరకు నోటీసులు అందుకున్న రాంగోపాల్ వర్మ విచారణకు హాజరయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, నారా లోకేష్ ఫొటోలను వర్మ మార్ఫింగ్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి.


వ్యూహం సినిమా ప్రమోషన్‌లో భాగంగా నాయకుల ఫొటోలు మార్ఫింగ్ చేసి రాంగోపాల్ వర్మ కించపరిచారు. రాంగోపాల్ వర్మపై గతేడాది నవంబర్ 10వ తేదీన మద్దిపాడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఏడాది ఫిబ్రవరి 7వ తేదీన విచారణకు వర్మ వచ్చారు. మరోసారి నోటీసులు జారీ చేయడంతో విచారణకి రాంగోపాల్ వర్మ హాజరయ్యారు.

Ram-Gopal-Varma.jpg


రాంగోపాల్ వర్మ సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. గత విచారణ సమయంలో వర్మ తన సెల్‌ఫోన్ తీసుకురాలేదు. రాంగోపాల్ వర్మ సెల్ ఫోన్‌లో ఆధారాలు కోసం పోలీసులు పరిశీలిస్తున్నారు. ఏపీ ఫైబర్ నెట్ నుంచి రాంగోపాల్ వర్మకి రూ.2కోట్లు చెల్లించింది గత వైసీపీ ప్రభుత్వం. ఆ రూ.2కోట్ల వ్యవహారంలోనూ ఆర్జీవీని విచారిస్తున్నారు. పోలీసులు. చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ ఫొటోలు మార్ఫింగ్ చేయడం వెనుక ఉన్న వారి గురించీ పోలీసులు ఆరా తీస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీలో క్రీడల అభివృద్ధి లబ్ధిదారులు లేరు

ముందస్తు బెయిల్‌కు సురేశ్‌బాబు అనర్హుడు

For More AndhraPradesh News And Telugu News

Updated Date - Aug 12 , 2025 | 01:41 PM