Home » Vyooham
ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్‌లో విచారణకు ప్రముఖ దర్శకుడు రాంగోపాల్ వర్మ హాజరయ్యారు. మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఒంగోలు రూరల్ సీఐ శ్రీకాంత్ నోటీసులు జారీ చేశారు.
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో రూపొందిన వ్యూహం చిత్రంపై తెలంగాణ హైకోర్టులో సస్పెన్షన్ కొనసాగుతోంది. ఇప్పటికే హైకోర్టులో ఇరువైపుల వాదనలు పూర్తి అయ్యాయి. శుక్రవారం మధ్యాహ్నం తీర్పు ప్రకటించనుంది.
ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి అధ్యక్షులు డా. కొలికపూడి శ్రీనివాస్‌రావు ( Kolikapudi Srinivas Rao ) ను అరెస్ట్ చేసేందుకు ఏపీ సీఐడీ ( AP CID ) ప్రత్యేక బృందం హైదరాబాద్‌కి చేరుకున్నది. 8 మంది సీఐడీ అధికారులు నల్లగండ్లలోని అపర్ణ సైబర్ లైఫ్ గేటెడ్ కమ్యూనిటీలో ఉండే కొలికపూడి శ్రీనివాస్‌రావు నివాసానికి చేరుకున్నది. కొలికపూడి హైదరాబాద్‌లో అందుబాటులో లేరని తన సతీమణి చెప్పినా వినడం లేదు.
అమరావతి: ఆర్జీవీ దర్శకత్వంలో రూపొందిన ‘వ్యూహం’ సినిమాపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పందించారు. ఈ సందర్భంగా శుక్రవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ వ్యూహానికి ప్రతి వ్యూహం ఉంటుంది కదా..? అని అన్నారు. ఎన్నికల ముందు ఈ తరహా సినిమాలు తీయడం ఓ ఫ్యాషన్ అయిందని..
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై గురువారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
హైదరాబాద్: రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నిర్మించిన ‘వ్యూహం’ సినిమాపై మంగళవారం తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుంది. ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
దర్శకుడు రాంగోపాల్ వర్మ ( Ramgopal Varma ) కి సివిల్ కోర్టు బిగ్ షాకిచ్చింది. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమాను OTT , ఇతర Flatformలలో విడుదలను నిలిపివేస్తూ సివిల్ కోర్టు ( Civil Court ) ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహ్యం సినిమా విడుదలను నిలిపి వేయాలని సివిల్ కోర్ట్‌లో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటీషన్ వేశారు.
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma) తాజాగా మరో అతి పనితో హాట్ టాపిక్ అయ్యాడు. నిత్యం సోషల్ మీడియాలో (Social Media) ఏదో ఒక హడావుడి చేస్తూ.. ఎవరినో ఒకర్ని టార్గెట్ చేస్తూ ఉండే ఆర్జీవీ నెటిజన్లు, వీరాభిమానులతో తిట్లు, కౌంటర్లకు కొదువే ఉండదు..
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు (Devineni Uma).. టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (RGV) మధ్య ట్విట్ వార్ (Twitter War) నడుస్తోంది.